భారత ప్రథమ సామాజికతత్వవేత్త పూలే గారు
చిలకలూరిపేట శాసనసభ్యురాలు విడదల రజిని గారు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావ్ పూలే గారికి ఘన నివాళి
మహాత్మ జ్యోతిరావ్ పూలే గారు భారత దేశ ప్రథమ సామాజికతత్వ వేత్త అని చిలకలూరిపేట శాసనసభ్యురాలు విడదల రజిని గారు పేర్కొన్నారు. జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సందర్భంగా శనివారం స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పూలే గారి చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే విడదల రజిని గారు మాట్లాడుతూ పూలే గారు గొప్ప సామాజిక కార్యకర్త అని చెప్పారు. కులాలకు వ్యతిరేకంగా పోరాడిన మహోన్నతుడని తెలిపారు. బడుగు, బలహీనవర్గాల ప్రజలకు ఆత్మస్థైర్యం కల్పించి, వారి హక్కుల కోసం పోరాడి, సాధికారత కల్పనకు కృషి చేసిన పూలేను భవిష్యత్తు తరాలు ఎప్పటికీ గుర్తుంచుకుంటాయని వెల్లడించారు. లాంతరు వెలుతురులో చదువుకుని దేశానికే మార్గనిర్దేశం చేసే స్థాయికి ఎదిగిన పూలే గారి జీవితం నేటి యువతకు ఎంతో ఆదర్శమని చెప్పారు. 18వ శతాబ్దంలోనే బాల్య వివాహాలు అడ్డుకోవడమే కాకుండా, వితంతువులకు వివాహాలు జరిపించిన గొప్ప వ్యక్తి అని తెలిపారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ బొల్లెద్దు చిన్న,రాష్ట్ర ముస్లిం కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ దరియా వలి,రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ డైరెక్టర్ కొండెబోయిన అనూష,రాష్ట్ర ముస్లిం,మైనారిటీ కార్యదర్శి అల్లిమియా, పట్టణ అధ్యక్షుడు పఠాన్ తలహాఖాన్,పట్టణ ప్రధాన కార్యదర్శి మారుబోయిన నాగరాజు,బీసీ సెల్ అధ్యక్షుడు గుంజి వీరంజనేయులు, ముస్లిం మైనారిటీ సెల్ అధ్యక్షుడు బేరింగ్ మౌలాలి,యస్.సి సెల్ అధ్యక్షుడు బండారు వీరయ్య,ఎస్టీ సెల్ అధ్యక్షుడు బాలకోటి నాయక్,మునిసిపల్ ఛైర్పర్సన్ అభ్యర్థి కొలిశెట్టి శ్రీనివాసరావు,మార్కెట్ యార్డ్ డైరెక్టర్ ఉప్పాల భాస్కర్,పార్టీ నాయకులు రఫాని,శాపా సైదా వలి,తాళ్ల అంజిరెడ్డి, యూసుబ్,గుంజి పద్మావతి,బండారు కొటేశ్వరమ్మ,నకిరికంటి శ్రీకాంత్,సిరాజ్,బాజి,తాళ్ల అంజిరెడ్డి, పొన్నం శివ,బిట్ర శ్రీరాములు,రామిశెట్టి శివ,కుల్లి చిన్నబాబు, మరియు పలువురు నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
0 comments:
Post a Comment