పట్టణ ప్రముఖులైన షేక్ జమాల్ బాషాను సత్కరించిన దళిత చైతన్య స్రవంతి సభ్యులు.
చిలకలూరిపేట:పట్టణంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భవన్ లో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. దళిత చైతన్య స్రవంతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సభలో భారత రాజ్యాంగ విశిష్టతను వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమానికి పట్టణంలోని ప్రముఖ రాజకీయవేత్త, సామాజికవేత్త, సంఘ సంస్కర్త అయిన షేక్ జమాల్ బాషా ముఖ్యఅతిథిగా హాజరైన సభా కార్యక్రమానికి సామాజిక చైతన్యకారుడు, విద్యావంతుడు షేక్ జబ్బార్ అధ్యక్షత వహించారు. జమాల్ బాషా మాట్లాడుతూ భారత రాజ్యాంగ ప్రాముఖ్యతను వివరించారు. దేశంలోని కోట్లాదిమంది ఎస్సీ, ఎస్సీ ,బిసి మైనారిటీ వర్గాలకు స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావాన్ని, మత స్వేచ్ఛను ప్రసాదించిన గ్రంథం భారత రాజ్యాంగమని, ఆ రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మహోన్నత నాయకుడని ఆయన భారతదేశ ప్రజల నాయకుడు కొనియాడారు. సభాధ్యక్షులు కార్యక్రమం విశిష్టతను వివరిస్తూ రాజ్యాంగ దినోత్సవం రోజు కోట్లాదిమంది ప్రజలకు విముక్తి రోజని రాజ్యాంగాన్ని అందులో పొందుపరిచిన స్వేచ్ఛ స్వాతంత్ర హక్కుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ ,బిసి మైనారిటీల పైనే ఉందని ఆ దిశగా ఆయా వర్గాల ప్రజలు ప్రయత్నించాలన్నారు. ఈకార్యక్రమానికి ముందుగా స్రవంతి సభ్యులతో కలిసి జమాల్ బాషా, జబ్బార్ లు డాక్టర్ అంబేద్కర్ పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో స్రవంతి సభ్యులు న్యాయవాది బురదాగుంట ప్రసన్నకుమార్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం లేకపోతే భారత ప్రజలమైన మనము ఇంకా అవమానాల దోతరాలలోనే ఉండేవాళ్లమని రాజ్యాంగమే మనల్ని నేటికీ రక్షిస్తుందని రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలని తెలిపారు. మరొక స్రవంతి సభ్యులు ఎడ్ల వినీల్ మాట్లాడుతూ ఈ రాజ్యాంగ దినోత్సవం ప్రతి ఒక్కరూ జరపాలని, భారత రాజ్యాంగమే ప్రజాస్వామ్యంలో అత్యున్నత గ్రంథమని రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ తమ చేతుల్లో పట్టుకోవాలని పేర్కొన్నారు. అనంతరం స్రవంతి అధ్యక్షులు నల్లపు కోటేశ్వరరావు, సభ్యులు బుల్లి, బత్తుల విక్రమ్, కుడారి సోను, మాలమహానాడు నాయకులు ఎడ్ల సురేష్ తదితరులు కలిసి షేక్ జమాల్ బాషా ను ఈ సందర్భంగా దుశ్శాలువతో, పూల మాలలతో ఘనంగా సన్మానించి, ప్రశంసాపత్రాన్ని బహుకరించారు.అలాగే విద్యావంతుడు సామాజిక స్ఫూర్తి కలిగిన షేక్ జబ్బార్ ను స్రవంతి సభ్యులు సత్కరించి మెమోంటో అందజేశారు. కార్యక్రమంలో వేకటేశ్వర్లు, బాలరాజు, మూకిరి కోటి, నారాయణ తదితరులు పాల్గొన్నారు.
0 comments:
Post a Comment