చెరువును తలపిస్తున్న ఏ. ఏం. జి ప్రాంగణము
వర్షం కురిస్తే చాలు చిలకలూరిపేట లోని వర్షపు నీరు అంతా ఏ ఏం జి ప్రాంగణం లోకే
కల్వ ర్టు లేక ఏ ఏం జి లోకి వెళ్తున్న నీటి ప్రవాహం.
వర్షం కురిస్తే చాలు చిలకలూరిపేట పట్టణంలోని వర్షపు నీరుతో పాటు డ్రైనేజి నీరు కూడా ఏ. ఏం. జి సంస్థ ప్రాంగణము లోనికి చేరుతుంది. షుమారు రెండేళ్లుగా ఈ పరిస్తితి నెలకొనడంతో ఏ.ఏం.జి సంస్థ లో పని చేసే సిబ్బంది తో పాటు విద్యా ర్దులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నా రు.
రెండేళ్ళు క్రితం కుమ్మ రి కాలనీ, యన్ టి ఆర్ కాలనీ తదితర ప్రాంతాల నుంచి వచ్చే వర్షపు మరియు డ్రైనేజి నీరును బయటకు పంపేందుకు ఏ. ఏం. జి సంస్థ ప్రహారి గోడ ప్రక్క నుంచే పెద్ద మురుగు నీటి కాలువను నిర్మించారు. ఈ కాలువను జాతీయ రహదారి వరకు నిర్మించి వదలి వేసినారు. ఆ ప్రాంతంలో కల్వ ర్టు నిర్మించక పోవటంతో ఈ పరిస్తితి నెలకొన్న ది.
వర్షం కురిసిన ప్రతిసారి యన్ ఆర్ టి సెంటర్ వైపు నుండి వచ్చే నీరు, వివిధ కాలనీల నుండి వచ్చే నీరు ఏ. ఏం. జి సంస్థకు ఈశాన్య ము వైపున ( కల్వ ర్టు లేక ) నిలిచి పోతున్న ది. నీటి ప్రవాహము నిలిచిపోవటంతో ఆ నీరంతా కాల్వ లోకి ఎగతన్ని సంస్థ ప్రాంగణము లోనికి నెట్టుకొని వస్తున్న ది. ఈ విధముగా నీరు ప్రాంగణం లోని స్టాఫ్ క్వా ర్టర్స్ నుండి విద్యా ర్దులు భోజనం చేసే డైనింగ్ హాలు వరకు నిలిచి పోతున్న ది. ఆ నీరు దుర్గంధము రేపడంతో అందరు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నా రు. చిలకలూరిపేట పట్టణం తోపాటుగా వివిధ ప్రాంతాలలోని వివిధ వర్గాలవారికి గత 52 సంవత్స రాలుగా సేవలు అందించే ఏ.ఏం.జి సంస్థ ఎదుర్కొంటున్న సమస్య ను పరిష్క రించవలసిన అవసరం ఎంతైనా ఉంది.
0 comments:
Post a Comment