చిలకలూరిపేట:కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రైతు కార్మిక ప్రజావ్యతిరేక విధానాలను మూట కట్టుకుంటుందని రాష్ట్రీయ క్రాంతి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు షేక్ గౌస్ అన్నారు.ఆదివారం తన పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల ఒక పది కార్మిక సంఘాలు చలో పార్లమెంట్ కు పిలుపునిచ్చాయని ఆన్నారు. రాష్ట్రీయ జన క్రాంతి పార్టీ అనుబంధ సంస్థ అయిన భవన నిర్మాణ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు మాట్లాడుతూ రైతులకు కార్మికులకు మరియు ముఖ్యముగా ప్రజలకు పూర్తిగా మద్దతు ఇస్తామని ఆయన అన్నారు. అలాగే ప్రభుత్వాలు ప్రతి ఒక్క కుటుంబానికి రూ.7500 రూపాయలు ఆర్థిక సహాయం చేయాలని దారిద్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబానికి ఉచితముగా నెలకు పది కేజీల సరుకులను ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.తదనంతరం భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు షేక్ బాషా మాట్లాడుతూ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా ఏడాదికి 200 రోజుల పనిని మెరుగైన వేతనాలతో అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ జన కాంతి పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జ్ షేక్ అలీ, భవన నిర్మాణ కార్మిక సంఘ కార్యదర్శి షేక్ మస్తాన్ తదితర సానుభూతిపరులు పాల్గొన్నారు.
0 comments:
Post a Comment