తిమ్మాపురం రేషన్ లారీ ను పట్టుకున్న పోలీసులు
గుంటూరు రూరల్: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం లారీని పోలీసులు బుధవారం మండలంలోని బుడంపాడు వద్ద పట్టుకున్నారు. నల్లపాడు ఎస్ఎ ఆరోగ్యరాజు తెలిపిన వివరాల ప్రకారం.. యడ్లపాడు మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన పావులూరి రామయ్య గ్రామాల్లో రేషన్ బియ్యాన్ని సేకరించి 600 బ్యాగుల్లో నింపి లారీలో కాకినాడకు తరలిస్తున్నాడు. అందిన సమాచారం మేరకు బుడంపాడు వద్ద లారీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బియ్యం విలువ రెండు లక్షల వరకూ ఉంటుంది. లారీతో పాటు డ్రైవర్ షేక్ నాగుల్ మీరా, క్లీనర్ షేక్ సైదాను, లారీ ఓనర్ పేరా శివారెడ్డిని, రామయ్యను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి కోర్టుకు అప్పగించనున్నట్లు ఎస్ఎ ఆరోగ్యరాజు తెలిపారు.
0 comments:
Post a Comment