చిలకలూరిపేట నియోజకవర్గం లో భారతీయ జనతా పార్టీ ఆఫీసు నందు నియోజకవర్గ కన్వీనర్ అన్నం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో చిలకలూరిపేట మండలంలోని కమ్మవారిపాలెం గ్రామం నుండి చాపల మడుగు రాజీవ్ గారు మరియు వారి మిత్రులు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు పట్ల మోడీ గారి నాయకత్వం పట్ల కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై భారతీయ జనతా పార్టీలో చేరుతున్నానని వారు తెలియజేసినారు భారతీయ జనతా పార్టీలో ఈరోజు నుండి చిత్తశుద్ధితో పార్టీ కార్యక్రమాలు పార్టీని ప్రజల్లోకి ముందుకు తీసుకెళ్ళే దిశగా అహర్నిశలు కృషి చేస్తామని వారు తెలియజేసినారు ఈ సందర్భంగా నియోజకవర్గ కన్వీనర్ అన్నం శ్రీనివాసరావు మాట్లాడుతూ యువత భారతీయ జనతా పార్టీ పట్ల నరేంద్ర మోడీ గారి పట్ల నమ్మకంతో ఎంతో మంది భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారని వారి చేరికను అభినందిస్తున్నానని వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసినారు ఈ కార్యక్రమంలో పట్టణ ఉపాధ్యక్షులు తన్నీరు పుల్లయ్య తన్నీరు రామారావు నాదెండ్ల మండల మైనార్టీ మోర్చా అధ్యక్షులు పఠాన్ నబీ ఖాన్ ఆఫీస్ సెక్రెటరీ గుమ్మ బాలకృష్ణ మొదలగు ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
0 comments:
Post a Comment