728x90 AdSpace

NAVATHARAM NEWS

Followers

Latest News

మల్లెల శివ నాగేశ్వర రావు .నేషనల్ ప్రెసిడెంట్ కేసరి యాక్టీవ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్

Wednesday, December 2, 2020

రైతు వ్యతిరేక వ్యవసాయ బిల్లులను ఉపసంహరించాలని కోరుతూ శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేయాలి



 రైతు వ్యతిరేక వ్యవసాయ బిల్లులను ఉపసంహరించాలని కోరుతూ శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేయాలి


చిలకలూరిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ డిమాండ్

భారతదేశ ఆర్థిక వ్యవస్థకు మూలమైన వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసే వ్యవసాయ  వ్యతిరేక బిల్లులను  రద్దు చేయాలని కోరుతూ శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేయాలని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ కన్వీనర్ యం రాధాకృష్ణ రాష్ట్రంలోని అధికార ప్రతిపక్ష పార్టీలను డిమాండ్ చేశారు గత ఐదు రోజుల నుండి గడగడలాడిస్తున్న  చలిని సైతం లెక్కచేయకుండా దేశ రాజధాని ఢిల్లీని ముట్టడించి వీరోచిత పోరాటం చేస్తున్న ఒక కోటి ఇరవై లక్షల మంది రైతుల గుండెచప్పుడు గమనించి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని   ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడులకు విజ్ఞప్తి చేశారు  తుఫాను సందర్భంగా నష్టపోయిన రైతులకు  సహాయపడే విషయంలో కొట్లాడుకుంటున్న యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ తెలుగు దేశం పార్టీలు రెండూ ఢిల్లీలో జరుగుతున్న రైతుల ఆందోళన గమనించడం లేదా అని ప్రశ్నించారు ఈ శతాబ్దంలోనే అతిపెద్ద  రైతు పోరాటంగా మన దేశంతో పాటు విదేశీయుల దృష్టిని సైతం ఆకర్షిస్తున్న మహా రైతుఉద్యమం గురించి ఒక్కమాట కూడా మాట్లాడకపోవడం ద్వారా రాష్ట్రంలోని అధికార ప్రతిపక్ష పార్టీలు రెండింటికీ రైతుల పట్ల గల ప్రేమను అభిమానాన్ని తేటతెల్లం చేస్తుందని అన్నారు  కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లుల వలన వ్యవసాయ రంగానికి రైతు రైతు కూలీలకు  ఏమి మేలు జరుగుతుందని  సమర్ధించారో అధికార ప్రతిపక్షాలు రెండూ కూడా రాష్ట్ర రైతాంగానికి వివరించాలని కోరారు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అంటే  భయంతోనే ఈ రెండు పార్టీలు వ్యవసాయ బిల్లుల విషయంలో పూర్తి సహకారం అందించాయని ఆరోపించారు కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అడగకుండానే మద్దతిచ్చి రెండు పార్టీలు స్వామి భక్తి ని ప్రదర్శించడంలో పోటీ పడుతున్నాయని  విమర్శించారు ఈ రెండు పార్టీలకు ఓట్లు వేసింది రాజకీయ భవిష్యత్తునిచ్చింది ఆంధ్ర రాష్ట్రంలోని అన్నదాతలా లేక మోడీ అమిత్ షాలా అని ప్రశ్నించారు ఇటీవల జరిగిన ఎన్నికల్లో 50 కోట్ల మంది భారతీయ జనతా పార్టీకి ఓట్లు వేసి నరేంద్ర మోడీ ని ప్రధానమంత్రిని చేస్తే ఆయన కేవలం ఐదుగురు వ్యక్తుల ప్రయోజనాల కోసం   పాటుపడడం ఎలా ఉందో  ఓట్లు వేసి గెలిపించిన అన్నదాతలకు మొండి చెయ్యి  చూపి అడగకుండానే  కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ వ్యతిరేక బిల్లులకు మద్దతివ్వడం కూడా అలాగే ఉందని అన్నారు  డిల్లీలో ప్రారంభమైన  రైతు ఉద్యమం ఆరంభమేనని అంతం కాదని అది దేశ వ్యాప్త ఉద్యమంగా మారకముందే కేంద్ర ప్రభుత్వం మూడు వ్యవసాయ  వ్యతిరేక బిల్లులను తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా బిజెపి యేతర రాజకీయ పక్షాలతో పాటు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని రాధాకృష్ణ కోరారు

  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: రైతు వ్యతిరేక వ్యవసాయ బిల్లులను ఉపసంహరించాలని కోరుతూ శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేయాలి Rating: 5 Reviewed By: chilakaluripetalocalnews