పట్టణంలోని వై.యస్.ఆర్.సీపీ పార్టీ కార్యాలయంలో ముస్లిం మైనారిటీ సెల్ అధ్యక్షుడు బేరింగ్ మౌలాలి ఆధ్వర్యంలో జరిగిన పత్రిక సమావేశం.
ఈ సందర్భంగా ముస్లిం,మైనారిటీ నాయకులు మాట్లాడుతూ ముస్లిం,మైనారిటీ వర్గానికి చెందిన ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ గారిని నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రమైన పదజాలంతో దూషించారని దీనికి గాను ముస్లిం,మైనారిటీ లకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని అన్నారు.చంద్రబాబు నాయుడు కి ఏనాడు ముస్లింలపై ప్రేమ లేదని అందుకే తన హయాంలో ముస్లింలకు చివరివరకు మంత్రి పదవి ఇవ్వలేదని అన్నారు.తూఫాన్ కారణంగా నష్టపోయిన రైతులకు మేలు చేసే విధంగా తీర్మానం చేసేందుకు ప్రభుత్వం కృషిచేస్తుంటే దానిని అడ్డుకునేందుకు వయసు మరచి విచక్షణ జ్ఞానం లేకుండా వేలు చూపెడుతూ అనుచిత పదజాలంతో ఎమ్మెల్యేను దూషించటం ద్వారా అయన స్వభావం ఏంటో ప్రజలందరికి తెలిసిందిఅన్నారు.చంద్రబాబు నాయుడు గారికి వయస్సు పెరిగేటప్పటికి జ్ఞానం కోల్పోతున్నారని వృద్దాప్య పెన్షన్ తీసుకొని ఇకఇంట్లో కూర్చొని రాజకీయాలు చేసుకుంటే మంచిదని అన్నారు.ఈ సమావేశంలో రాష్ట్ర ముస్లిం కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ దరియా వలి,మైనారిటీ విభాగం రాష్ట్ర కార్యదర్శి షేక్ అల్లిమియా,పార్టీ పట్టణ అధ్యక్షుడు పఠాన్ తలహ ఖాన్,ముస్లిం,మైనారిటీ సెల్ ఉపాధ్యక్షులు యూసుఫ్ ఖాజా, నాయకులు నాగుల్ మీరా, కరీముల్లా,షేక్ బాజీ,ఖాజా వలి,సుభాని, మస్తాన్ వలి,రఫీ,నాగుర,ముస్తఫా,జానీ బాషా,సైదా మరియు పలువురు నాయకులు పాల్గొన్నారు.
0 comments:
Post a Comment