చిలకలూరిపేట పట్టణంలోని కె బి రోడ్ లో గల వంగవీటి మోహన్ రంగా విగ్రహానికిరంగా 33 వ వర్ధంతి సందర్భంగా ఆదివారం పాలాభిషేకం చేసి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమం కటారి సుధాకర్, ఏకాంబరం సునీత ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా యువ నాయకులు విడదల వేణు గోపీనాథ్ హాజరయ్యారు. పలువురు కాపు నాయకులు, వైయస్సార్ సిపి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
0 comments:
Post a Comment