చిలకలూరిపేట జనసేన పార్టీ ఆధ్వర్యంలో సెమిక్రిస్మస్ వేడుకలు, పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి తోట రమేష్ పాల్గొని, మాట్లాడుతూ చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలందరికీ సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రజలందరూ కరోనా నియమాలు పాటిస్తూ పండుగలు జరుపుకోవాలని ,ఏసు క్రీస్తు ప్రభువుని అనుసరిస్తూతూపొరుగు వారితో ప్రేమ, దయ, కరుణ కలిగి ఉండాలని అన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న సమతా సైనిక్ దళ్ జిల్లా ఉపాధ్యక్షుడు వంజా ముత్తయ్య మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏసుక్రీస్తు ప్రబోధించిన శాంతి, సహనo మార్గంలో జనసేన పార్టీ వారు ప్రయాణం చేయాలని ఆకాంక్షించారు, హ్యూమన్ రైట్స్ సంస్థ చైర్మన్ అబ్దుల్ మునాఫ్ మాట్లాడుతూ జనసేన పార్టీ నాయకులు ఈ సెమి క్రిస్మస్ నిర్వహించడం అభినందనీయమని, ముందు ముందు ఇలాంటి కార్యక్రమాలు జనసేన పార్టీ నాయకులు చాలా చేయాలని కోరారు,, మిత్ర సర్వీస్ సొసైటీ ప్రధాన కార్యదర్శి దేవరకొండ నాగేశ్వరరావు మాట్లాడుతూ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్న క్రీస్తు మాటలు గుర్తు చేశారు, ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు,,,ప్రజా సేవ సమితి మాదాసు నిరీక్షణ రావు, సాతులూరి బసవయ్య, మాణిక్యరావు, ప్రసాద్ , జనసేన పార్టీ నాయకులు మునీర్, కోసన్నపిచ్చయ్య , భాష, మల్ల కోటి, యోబు, కరిముల్లా, గల్లా వెంకట్రావు, సాయి బుజ్జి, పెద్దింటి సుమలత, అమరేశ్వరి, కోటేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.
0 comments:
Post a Comment