728x90 AdSpace

NAVATHARAM NEWS

Followers

Latest News

మల్లెల శివ నాగేశ్వర రావు .నేషనల్ ప్రెసిడెంట్ కేసరి యాక్టీవ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్

Sunday, December 26, 2021

ప్ర‌జాస్వామ్య , ప్ర‌జ‌ల హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణ‌కు సీపీఐ క‌ట్టుబ‌డి ఉంది






 ప్ర‌జాస్వామ్య , ప్ర‌జ‌ల హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణ‌కు సీపీఐ క‌ట్టుబ‌డి ఉంది

చిల‌క‌లూరిపేట‌: 

దేశంలోప్రజాస్వామ్య పరిరక్షణకు, ప్రజల‌ హక్కుల పరిరక్షణ కోసం పార్టీ కట్టుబడివుందని సీపీఐ ఏరియా ఇన్‌చార్జి కార్య‌ద‌ర్శి నాగ‌బైరు రామ సుబ్బాయ‌మ్మ తెలిపారు.  సీపీఐ ఆవిర్బావ దినోత్స‌వాన్ని ఆదివారం ఘ‌నంగా నిర్వ‌హించారు. సీసీఐ కార్యాల‌యం వ‌ద్ద అరుణ ప‌త‌కాన్ని ఎగుర‌వేసిన  సుబ్బాయ‌మ్మ నాయ‌కుల‌తో ప్ర‌తిజ్ఞ చేయించారు. ఈ సంద‌ర్బంగా ఆమె మాట్లాడుతూ  దోపిడి లేని సమాజాన్ని నిర్మించేందుకు  సీపీఐ పార్టీ ఆవిర్భవించిందని తెలిపారు.   ఎంతో మంది పేద, బడుగు బలహీన వర్గాలు సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళి పరిస్కారం అయ్యే దిశగా అడుగులు వేస్తున్న పార్టీ సీపీఐ అని చెప్పారు.  గత 97 సంవత్సరాలుగా ఎన్నో పోరాటాలు చేసిన ఘనత తమ పార్టీలదేనని గుర్తు చేశారు. భారత దేశ స్వాతంత్య్ర సమరంలో క‌మ్యునిస్టులు కీల‌క పాత్ర‌ పోషించి అమరులయ్యారన్నారు.  సీపీఐ ఏర్పడినప్పటి నుంచి కార్మికుల కోసం, పేదప్రజల కోసం చేసిన కృషిని వివరించారు . ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటాలను సాగిస్తుందని,  రైతులు, కార్మికుల సంక్షేమం కోసం సీపీఐ ఎనలేని కృషి చేస్తోందన్నారు . ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర‌రాష్ట్ర  ప్రభుత్వాలపై భవిష్యత్తులో పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.    దేశంలో నియంత పాలన కొనసాగుతోందని ఆరోపించిన ఆమె నియంతృత్వ శక్తులను అడ్డుకునేందుకు ఏకం కావాలని పిలుపునిచ్చారు. కార్య‌క్ర‌మానికి ఏఐవైఎఫ్ జిల్లా కార్య‌ద‌ర్శి షేక్  సుభాని అధ్య‌క్ష‌త వ‌హించ‌గా, ఏఐటీయూసీ ఏరియా అధ్య‌క్ష కార్య‌ద‌ర్శ‌లు పేలూరి రామారావు, దాస‌రి వ‌ర‌హాలు, ఉపాధ్య‌క్షుడు సీఆర్ న‌ర‌సింహ‌భార‌తి,    రైతు సంఘం నాయ‌కులు  తాళ్లూరి బాబురావు, వ్య‌వ‌సాయ కార్మిక సంఘం ఏరియా కార్య‌ద‌ర్శి చౌటుప‌ల్లి నాగేశ్వ‌ర‌రావు,  ఏపీ మ‌హిళా స‌మాఖ్య ఏరియా కార్య‌ద‌ర్శి సీఆర్ నిర్మ‌ల‌, ఏవైవైఎఫ్ ఏరియా కార్య‌ద‌ర్శి చిన‌బాబు,  నాయ‌కులు ల‌లిత , శివ‌లీల‌, న‌ర్సింహ‌, కొండ‌ల‌రావు, మ‌ద్దుకూరి బాబు త‌దిత‌రులు పాల్గొన్నారు.

  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: ప్ర‌జాస్వామ్య , ప్ర‌జ‌ల హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణ‌కు సీపీఐ క‌ట్టుబ‌డి ఉంది Rating: 5 Reviewed By: chilakaluripetalocalnews