రాష్ట్ర కార్యదర్శి ఇనగంటి జగదీష్ బాబు గారు.
దళితుల ఓట్లతో ముఖ్యమంత్రి కుర్చీపై కూర్చున్న జగన్మోహన్ రెడ్డి దళితులపై దాడులు చేయిస్తున్నారని రాష్ట్ర కార్యదర్శి ఇనగంటి జగదీష్ బాబు గారు ద్వజమెత్తారు. దాడులకు పాల్పడుతున్న వారిని శిక్షించడం మానేసి వెనకేసుకొస్తున్నారు. గుంటూరు జిల్లా పెదనందిపాడులో వైసీపీ కార్యకర్తలు వెంకటనారాయణ అనే దళితుని పై పెట్రోల్ పోసి నిప్ప౦టీ౦చడంతో చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. కనీసం వారి కుటుంబాన్ని పరామర్శించడానికి కూడా వైసిపిలోని దళిత మంత్రులు, ఎమ్మెల్యేలకు నోరు రావడం లేదు. దళితులపై దాడులు చేసిన వారిని శిక్షించడం లేదు. దళిత మహిళలపై అత్యాచారాలు, హత్యలు చేసినవారిని శిక్షించడం లేదు. ముఖ్యమంత్రి ఇంటి సమీపంలో పెళ్లి కావలసిన దళిత యువతిపై అత్యాచారం జరిగి అర్ధ సంవత్సరం అవుతున్నా నిందితులను పట్టుకోలేదు. గుంటూరు నడిబొడ్డున రమ్యను కత్తితో పొడిచి చంపితే నిందితున్ని శిక్ష పడలేదు. దాడులకు గురైన బలహీన వర్గాల వారిని పరామర్శించుకునే స్వేచ్ఛ కూడా రాష్ట్రంలో లేదు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయకుండా రాజారెడ్డి రాజ్యాంగంతో అల్లకల్లోలం సృష్టిస్తామంటే ఏ దళితుడు చూస్తూ ఊరుకోడు. ఇప్పటివరకు దాడికి గురైన ప్రతి దళిత బాధిత కుటుంబాలకు ప్రభుత్వం రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి. ఆసుపత్రిలో వైద్యం పొందుతున్న వెంకటనారాయణ వైద్య ఖర్చుల కోసం తక్షణమే ప్రభుత్వం రూ. 5 లక్షలు అందించాలి. నిందితులపై చర్యలు తీసుకొని అరెస్ట్ చేయాలి. దాడులు పునరావృతమైతే దళిత సంఘాలు, ప్రజా సంఘాలతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఫ్రీడం మార్చ్ నిర్వహించి ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు.
0 comments:
Post a Comment