నూతనం, ప్రారంభం, ఆరంభం, కొత్త అనే పదాల లోనే ఒక ఉత్తేజం నిబడి కృతమై ఉంటుంది. మరి కొత్త సంవత్సరం అంటే ఎన్నో ఆశలు, ఎన్నో ఆశయాలు, మరెన్నో ఆకాంక్షలు, లక్ష్యాలతో సంగమమై మన ముందుకు తరలి వస్తుంది. అలా మన ముందు ఆవిష్కరమవుతున్న2022 నవ వసంతానికి ఆహ్వానం పలుకుతూ తెలుగువారందరి తో పాటు , చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలకు నా తరఫున, జనసేన పార్టీ తరఫున,జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు. గడిచిన రెండేళ్లలో కరోనా మహమ్మారి వలన, ప్రకృతి వైపరీత్యాల వలన ప్రజలు అనేక ఇబ్బందులు పడటం జరిగింది. కావున కరోనా నియమాలు పాటిస్తూ ఈ నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని, రానున్న కాలంలో ప్రజలందరూ ఆరోగ్యకరం, ఆనందమైన జీవితం గడపాలని, ఈ నూతన సంవత్సరంలో తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా విరిసిల్లాలని, ఎటువంటి ఇతీ బాధలు లేకుండా ప్రజలకు సుఖసంతోషాలు ప్రసాదించాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాను. ఇట్లు..... తోట రాజా రమేష్, జిల్లా కార్యదర్శి.
0 comments:
Post a Comment