వంగవీటి రాధాకృష్ణ హత్యకు కుట్రలు చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని నవతరంపార్టీ జాతీయ అధ్యక్షు27.12.2021.. Press Note.
వంగవీటి రాధాకృష్ణ హత్యకు కుట్ర జరుగుతోందని స్వయంగా రాధాకృష్ణ ప్రకటన పలు అనుమానాలకు తావిస్తోంది అని,ఆయనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రత్యేక భద్రత కల్పించాలని నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో వంగవీటి మోహనరంగా చెరగని ముద్ర వేశారు అని,కీలకమైన కుటుంబం నుండి వచ్చిన రాధాకృష్ణ కు హాని జరిగితే రంగా హత్య జరిగిన సమయంలో జరిగిన సంఘటనలు పునరావృతం అయ్యే అవకాశాలు ఉన్నాయి అని, కనుక వంగవీటి రాధాకృష్ణ కు భద్రత కల్పించాలని కోరారు.ఆయన సోదరుడు వంగవీటి నరేంద్ర కూడా భద్రత కల్పించాలని డిమాండ్ చేసిన విషయం రావుసుబ్రహ్మణ్యం గుర్తు చేశారు.27.12.2021 సోమవారం సాయంత్రం నవతరంపార్టీ చిలకలూరిపేట కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారుడు రావుసుబ్రహ్మణ్యం డిమాండ్.
0 comments:
Post a Comment