చిలకలూరిపేచిలకలూరిపేట పట్టణంలో ఈనెల 31 నుంచి 75 మైక్రాన్‌ల కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వాడకాన్ని నిషేదిస్తున్నట్లు మునిసిపల్ కమిషనర్ డి.రవీంద్ర తెలిపారు. కమిషనర్ రవీంద్ర మాట్లాడుతూ సింగిల్ యూజ్, ప్లాస్టిక్, 75 మైక్రాన్‌ల కన్నా తక్కువ సామర్థ్యం కలిగిన ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు అమ్మినా, కొన్నా లేదా వినియోగించినా జరిమానా విధించడంతోపాటు చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల తయారీదారులకు రూ.50వేలు, రిటైల్ వర్తకులకు రూ.2,500ల నుంచి రూ.15వేలు, వినియోగదారులకు రూ.100ల నుంచి రూ.500ల వరకు జరిమానా విధించడం జరుగుతుందన్నారు. పట్టణ ప్రజలు, వ్యాపార సంస్థల వారు అందరూ పేపర్ బ్యాగులు లేదా జ్యూట్ బా్యగులు వినియోగించి చిలకలూరిపేట పట్టణాన్ని ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు తోడ్పడాలని కోరారు.ట ఈనెల 31 నుంచి ప్లాస్టిక్ నిషేధం అమలు మునిసిపల్ కమిషనర్ రవీంద్ర
0 comments:
Post a Comment