పత్రికాప్రచురణార్ధం✍🏻
మున్సిపల్ పాఠశాలలో ఘనంగా "బాషోత్సవాలు".
రాష్టృ ప్రభుత్వం గత నాలుగురోజులనుండి 1-10తరగతులవిద్యార్ధినీ, విద్యార్ధులకు బాషాసామర్ధ్యాల పెంపొందించడానికై సమగ్రశిక్షా అభియాన్ ఆధ్యర్యంలో బాషోత్సవాలను నిర్వహిస్తుందని చిలకలూరిపేట మున్సిపల్ ప్ర్రెమరీ స్కూల్స్ సూపర్ వైజర్ పోటు.శ్రీనివాసరావు అన్నారు.ఈరోజు చివరిరోజు డా"మర్రిచెన్నారెడ్డి మున్సిపల్ ప్రాధమికపాఠశాలల్లో కార్యక్రమం నిర్వహించారు. మాతృభాషలో పట్టు సాధిస్తేనే అన్ని సబ్జెక్టులలో మంచి ప్రావీణ్యం సంపాదించవచ్చని విద్యార్ధులచు సూచించారు. బాషద్వారానే సంస్కృతి అభివృద్ది జరుగుతుందన్నారు. బాషద్వారానే సత్సంబందాలు పెంపొందుతాయన్నారు.అన్ని తరగతుల విద్యార్ధినీ, విద్యార్ధులకు తరగతులవారీగా తెలుగు,పద్యాలు గేయాలను శ్రావ్యంగా పాడటం,ఇంగ్లీష్ రైమ్స్ లో పోటీలు నిర్వహించడం జరిగింది. పోటీలలోప్రధమ,ద్వితీయ, తృతీయ స్ధానాలను పొందిన విద్యార్ధులకు బహుమతి ప్రధానం చేయడం జరిగింది.పాఠశాల ఇన్ చార్జి ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి.ఏ.నీలిమ,వార్డుఎడ్యుకేషన్ సెక్రటరీ.కామేశ్వరరావు, పేరెంట్స్ కమిటీ వైస్ ఛైర్మన్ షకీలా,సభ్యులు,రత్నకుమారి,సంధ్యారాణి,ఐ.ఈ.డి.టీచర్లు విశ్వప్రసాద్,అన్నేగ్రేస్ తదితరులు పాల్గొన్నారు.
0 comments:
Post a Comment