15 వ ఆర్థిక సంఘం మెంబర్ కోటాకు ఘన సన్మానం
రాష్ట్రస్థాయిలో 15వ ఆర్థిక సంఘం మెంబర్గా చిలకలూరిపేట కు చెందిన ఎస్ టి కు దక్కటం సంతోషదాయకమైన ఎమ్మెల్యే విడుదల రజిని అన్నారు. చిలకలూరిపేట పురపాలక సంఘం తరఫున కోట నాయక్ కు జరుగుతున్న పౌర సన్మానం కార్యక్రమం లో ఎమ్మెల్యే విడుదల రజిని ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిలకలూరిపేట నుండి ఆర్థిక సంఘం మెంబర్ గా ఈ పదవి సీఎం జగన్మోహన్ రెడ్డి కేటాయించడం హర్షణీయమన్నారు. ఓసి కు ఇవ్వవలసిన మెంబర్ ఒక ఎస్ టి ఇవ్వమని ఎమ్మెల్యే విడుదల రజిని సీఎంకు అడిగారని.. సీఎం ఈ పదవి ఎస్టీ కు ఇవ్వటం చిలకలూరిపేట నియోజక వర్గాన్ని ఆర్థిక సంఘం నిధులతో అభివృద్ధి చేయటానికి దోహదం అవుతుందని ఎమ్మెల్యే రజని అన్నారు. కోటా నాయక్ కష్టపడి పనిచేసే మనస్తత్వం అని ఆమె అన్నారు. చిలకలూరిపేట నియోజకవర్గం లో ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీలకు ఉన్నత స్థానంలో ఉండేట్లు , కృషి చేస్తున్నట్లు, నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారని ఎమ్మెల్యే అన్నారు. అనంతరం 15 వ ఆర్థిక సంఘం మెంబర్ కోటా నాయక్ ను ఘనంగా సన్మానించారు. సభకు మున్సిపల్ కమిషనర్ రవీంద్ర అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ యార్డ్ చైర్మన్ మద్దిరాల విశ్వనాథం, వైస్ చైర్మన్ సుబ్రమణ్యం, మున్సిపల్ వైస్ చైర్మన్ కొలిశెట్టి శ్రీనివాసరావు, ఓలేటి వెంకటేశ్వర్లు, పట్టణ అధ్యక్షుడు తలహా ఖాన్, సొసైటీ అధ్యక్షుడు బ్రహ్మ స్వాములు, కౌన్సిలర్ మౌలాలి, తదితరులు పాల్గొని మాట్లాడారు..
0 comments:
Post a Comment