తేదీ అనగా 01.01.2022 న శనివారం నాడు మాజీ మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావు నివాసం వద్ద నూతన సంవత్సర వేడుకలు నిర్వహించబడును. ఉదయం 9.00 గంటలకు ప్రత్తిపాటి పుల్లారావు గారు కేకును కట్ చేయడం జరుగును. అనంతరం అల్పాహారం విందు, భోజన ఏర్పాటు జరుగును. నూతన సంవత్సరం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసే వారు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రతి ఒక్కరు కూడా మాస్కును తప్పనిసరిగా ధరించాలి, శానిటైజర్ ను ఉపయోగించి ప్రభుత్వ నిబంధనలను పాటించాలని తెలియజేశారు. మూడు మండలాలు, పట్టణంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ తప్పక హాజరు కావలసిందిగా కోరుతున్నాము. ఈ పత్రికా ప్రకటన చేసిన వారిలో పట్టణ ప్రధాన కార్యదర్శి పఠాన్ సమద్ ఖాన్ , చిలకలూరిపేట రూరల్ మండల అధ్యక్షులు జవ్వాజి మదన్ మోహన్, నాదెండ్ల మండల అధ్యక్షులు బండారుపల్లి సత్యనారాయణ, యడ్లపాడు మండల అధ్యక్షులు ముద్దన నాగేశ్వర రావు ఉన్నారు.
0 comments:
Post a Comment