శిరీష భాయ్ కి జయ జయ సాయి ట్రస్ట్ వారి బేస్ట్ సర్వీస్ అవార్డ్- ----- చిలకలూరిపేట జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యములో ప్రముఖ సంఘ సేవకురాలు బాణవత్ శిరీష భాయ్ కి ISO9001-2015 అంతర్జాతీయ గుర్తింపు పొందిన జయ జయ సాయి ట్రస్ట్ వారు నేషనల్ బెస్ట్ సర్వీస్ అవార్డ్ ను అందజేశారు,గత 5 సంవత్సరాల గా పేదలకు దుప్పట్లు,అన్నదాన కార్యక్రమలు నిరవహిస్తూ తన సంపాదనలో సగం భాగం సామాజిక సేవా కార్యక్రమాలు కు ఖర్చు చేస్తూ ఉన్న ఆమెను ట్రస్ట్ వారు గుర్తించి అవార్డ్ ను అందజేశారు,అనంతరం గురువారం సందర్భముగా ప్రత్యేక పూజలు జరిగినాయి,పుల్లెటికుర్తి కృష్ణ ఆర్థిక సహకారంతో 100 మంది పేదలకు అన్నదాన కార్యక్రమం నిరవహించారు,ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ పూసపాటి బాలాజి,బీసీ యునైటెడ్ ఫ్రంట్ పార్టీ అధ్యక్షుడు వేముల శ్రీనివాసరావు,రాష్ట్రీయ జన క్రాంతి పార్టీ రాష్ట్ర అధ్యక్ష్యులు షైక్ గౌస్, కంపౌంఢర్ అసోసియేషన అధ్యక్ష్యులు కొండ్రముట్ల నాగేస్వరావు,విశ్వబ్రాహ్మణ సంఘ నాయకులు మానేపల్లి సుధాకర్,చర్మకారుల సంఘ నాయకులు సలికినీడి నాగరాజు,తదితరులు పాల్గొన్నారు,ట్రస్ట్ చైర్మన్ పూసపాటి బాలాజి మాట్లాడుతూ సేవను గుర్తించి పురస్కారాలు అందజేస్తున్నామని,ప్రతిభ కలిగినవారిని,సేవ చేసేవారికి ప్రోత్సహం ఇస్తే మరి అన్ని సేవ కార్యక్రమాలు నిరవహించి పేద ప్రజలను అదుకుంటారని తెలిపారు
Thursday, December 30, 2021
- Blogger Comments
- Facebook Comments
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment