ప్రజలందరికీ మరీ ముఖ్యంగా క్రైస్తవ సోదర, సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు. బైబిల్ అనగా సత్యము, నీతి, నిజాయితీ.
మతము అనేది ఒక జీవన విధానం. క్రైస్తవులు Church లో ఆరాధించిన, ముస్లింలు మసీదులో నమాజ్ చేసిన, హిందువులు గుడిలో పూజలు నిర్వహించిన, హిందూ ముస్లిం, క్రైస్తవ భక్తులు ఆయా దేవుళ్ళను కోరుకునే అంశాలు దాదాపుగా ఒకటిగానే ఉంటాయి.
భక్తుల న్యాయబద్ధమైన కోరికలు నెరవేరాలి అంటే, మన రాజ్యాంగం పటిష్టంగా అమలు కావాలని కోరుకుంటున్నాము అని అర్థం.
రాజ్యాంగంలోని లక్ష్యాలను చేరుకోవాలంటే ఆ దిశగా మన పాలకులు పని చేయగలగాలి.
కనుక మనం మన ప్రతినిధులను నిర్ణయించుకునేటప్పడు నిష్ఠాతో, సత్యముతో, నీతితో, నిజాయితీతో ఆలోచించగలిగిన నాడే సమాజంలో మంచి జరుగుతుంది అనే విషయాన్ని భక్తులు అర్థం చేసుకోవాలి. అదే నిజమైన సంతోష క్రిస్మస్..
మాదాసు భాను ప్రసాద్, M.A., LL.B.,
అడ్వకేట్ & లోక్ సత్తా పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్..
0 comments:
Post a Comment