మానవ జాతి చరిత్రలో విశిష్టమైన అధ్యాయం క్రీస్తు జననంతో ప్రారంభమైందని చిలకలూరిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి యం రాధాకృష్ణ అన్నారు విశ్వ మానవ చరిత్ర క్రీస్తుకు పూర్వం క్రీస్తుశకం అని రెండు భాగాలుగా అధ్యయనం చేసే విధంగా ప్రభావితం చేసిన కారణజన్ముడు జీసస్ క్రీస్తు అని వ్యవస్థ లోని లోపాలను గతానికి భిన్నంగా శాంతి సహనం దయ జాలి కరుణ క్షమ ప్రేమలతో మార్పు తీసుకురావడానికి ప్రయత్నించిన దైవ కుమారుడు జీసస్ క్రీస్తు జన్మదినం సందర్భంగా నియోజకవర్గ క్రైస్తవ సోదరీ సోదరులకు రాధాకృష్ణ శుభాకాంక్షలు తెలియజేశారు నిస్వార్థ సేవకు క్రైస్తవ్యం ప్రతిరూపమని క్రీస్తు చూపిన మార్గంలో నడవడం ద్వారా సమస్యల రహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలని కోరారు ప్రమాదకరమైన మానవ జాతి మనుగడను ప్రశ్నార్థకంగా మారుస్తున్న కరోనా ఒమిక్రాన్ వంటి వైరస్ ల బారిన పడకుండా సకల మానవాళిని రక్షించేందుకు క్రీస్తు జన్మదినం సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేసి విశ్వ మానవ కళ్యాణ సాధనలో ఆదర్శ ప్రాయంగా నిలవాలని క్రైస్తవ సోదరీ సోదరులకు రాధాకృష్ణ విజ్ఞప్తి చేశారు
0 comments:
Post a Comment