వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పై చర్యలు తీసుకోవాలని, రైతు నరేంద్ర పై కేసుని ఎత్తివేయాలని నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం డిమాండ్.
10.01.2022..చిలకలూరిపేట.. నవతరంపార్టీ
వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పై చర్యలు తీసుకోవాలని,రైతు నరేంద్ర పై కేసుని ఎత్తివేయాలని నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు.సోమవారం 10.01.2022 సాయంత్రం 4 గంటల సమయం లో చిలకలూరిపేట నవతరంపార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రైతులకు అండగా ఉంటామని మాట్లాడాల్సిన వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు రైతు నరేంద్ర ను చెప్పుతో కొడతా అని బెదిరించడం, తప్పుడు కేసులు పెట్టి జైలులో పెట్టించడం సరికాదని అన్నారు. గతంలో కూడా జర్నలిస్ట్ పైన బెదిరింపులు చేశారు అన్నారు. బొల్లా బ్రహ్మనాయుడు పై ముఖ్యమంత్రి, స్పీకర్,గవర్నర్ చర్యలు తీసుకోవాలని కోరారు.
0 comments:
Post a Comment