బీజేపీ ఆంధ్రప్రదేశ్లో మతరాజకీయలు చేయాలని చూస్తే తిప్పికొట్టాలని నవతరంపార్టీ పిలుపు.
ప్రెస్ నోట్.. నరసరావుపేట..03.01.2022.
జిన్నా టవర్ కూల్చి వేస్తామని బీజేపీ నేతల బెదిరింపులు మతచిచ్చు రగిల్చే వ్యవహారం అని ఇటువంటివి తిప్పికొట్టాలని నవతరంపార్టీ జాతీయ అధ్యక్షులు రావుసుబ్రహ్మణ్యం పిలుపునిచ్చారు. విభజన హామీలను అమలు చేయడం మరిచిపోయిన బీజేపీ పైన ఆగ్రహం తో ప్రజలున్నారనే విషయం మరచిపోయి విజయవాడలో ప్రజాగ్రహ సభ నిర్వహించడం సిగ్గుచేటన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు 50 రూపాయల కే చీప్ లిక్కర్ ఇస్తామనడం ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు రాష్ట్ర ప్రజల్ని అవమానించడమే అన్నారు. విజయవాడలో బీజేపీ నేతలు రికార్డు డాన్సర్ల మాదిరిగా నృత్యాలు చేయడంతో పార్టీ పరువును గంగపాలు చేసారని అన్నారు.బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రా రాజకీయాల్లో విషం చిమ్ముతోందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలి అని తెలిపారు.నరసరావుపేట కార్యాలయంలో 03.01.2022న జరిగిన విలేఖరుల సమావేశంలో డాక్టర్ గోదా రమేష్ కుమార్,బత్తుల అనిల్ తదితరులు పాల్గొన్నారు.
0 comments:
Post a Comment