బీసీలంతా జగనన్నకు రుణపడి ఉంటారు
ముదిరాజుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళతాను
చిలకలూరిపేట శాసనసభ్యురాలు విడదల రజిని
ఎమ్మెల్యేతో ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ వెంకటనారాయణ ఆత్మీయ సమావేశం
బీసీలంతా జగనన్నకు ఎప్పటికీ రుణపడి ఉంటారని చిలకలూరిపేట శాసనసభ్యురాలు విడదల రజిని తెలిపారు. ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ వెంకటనారాయణ మంగళవారం ఎమ్మెల్యే విడదల రజినిని చిలకలూరిపేటలోని ఎమ్మెల్యే కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా ఆయన ముదిరాజుల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీసీల అభ్యున్నతికి అహర్నిశలూ కృషి చేస్తున్న వ్యక్తి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అని తెలిపారు. బీసీలకు నామినేటెడ్ పోస్టులు, పనుల్లో రిజర్వేషన్లు కేటాయించారని తెలిపారు. ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసి బీసీలకు సమాజంలో గుర్తింపు కల్పించారని పేర్కొన్నారు. ముదిరాజుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారమయ్యేలా చొరవచూపుతానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ డైరెక్టర్ కొండెబోయిన అనూష,ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధానకార్యదర్శి వల్లిబొయిన రాజు, పార్టీ ప్రధాన కార్యదర్శి మారుబోయిన నాగరాజు,గోగుల నాగరాజు మరియు పలువురు ఉన్నారు.
0 comments:
Post a Comment