గిరిజన బాలికలపై అత్యాచారం చేసిన వారిని ఉరి శిక్ష వేయాలి. ఏపీ గిరిజన సంఘాల ఐక్యవేదిక డిమాండ్.
చిలకలూరిపేట;గిరిజన బాలికలపై అత్యాచారం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఏపీ గిరిజన సంఘాల ఐక్యవేదిక నాయకులు అన్నారు. స్థానిక గిరిజన సంఘం ప్రాంతీయ కార్యాలయంలో వారు మాట్లాడుతూ ఈ ఘటన విజయనగరం జిల్లా జియ్యమ్మ వలస మండలం లో రావాటలో జరిగిందని, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పుష్ప శ్రీ వాణి సొంత నియోజకవర్గమైన కురుపాం నియోజకవర్గ పరిధిలోకి వస్తుందని వారు పేర్కొన్నారు. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న బాలికల ఇద్దరు నూతన సంవత్సరం కావడంతో వసతి గృహం నుంచి బయటకు వచ్చారని వారి మీద కన్నేసిన కొంతమంది ఆకతాయిలు వారిని వెంబడించి అత్యాచారానికి ఒడిగట్టారని అటువంటివారిని ఉరిశిక్ష వేయాలని ఏ.పి గిరిజన సంఘాల ఐక్యవేదిక తరపున డిమాండ్ చేశారు. బాలికలకు అందించే వైద్య సదుపాయాల ఖర్చంతా రాష్ట్ర ప్రభుత్వమే భరించి, వారికి భరోసాగా ఉండాలని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ గిరిజన సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు శ్రీను నాయక్, నియోజకవర్గ కోశాధికారి రాంబాబు నాయక్, దళిత నాయకులు కాకాని రోశయ్యతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
0 comments:
Post a Comment