728x90 AdSpace

NAVATHARAM NEWS

Followers

Latest News

మల్లెల శివ నాగేశ్వర రావు .నేషనల్ ప్రెసిడెంట్ కేసరి యాక్టీవ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్

Monday, January 3, 2022

భారతదేశ చరిత్రలోనే సామాజిక విప్లవకారుడిగా ఘనతకెక్కిన జ్యోతిబా ఫూలే సతీమణి సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా..



భారతదేశ చరిత్రలోనే సామాజిక విప్లవకారుడిగా ఘనతకెక్కిన జ్యోతిబా ఫూలే సతీమణి సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా పట్టణంలోని వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సావిత్రిబాయి పూలే గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కులమతాల పేరుతో తరతరాలుగా అణచివేతకు గురైన నిమ్నజాతి ప్రజలకు ఆత్మస్థైర్యం కల్పించి, హక్కుల కోసం పోరాడిన మహనీయుడు మహాత్మ జ్యోతిభాపూలే అర్థాంగి ఆమె, భర్తకు తగ్గ భార్యగా సావిత్రి కూడా ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నారు. భారతదేశంలో మహిళా విద్యకు పెద్దపీట వేస్తూ, ముఖ్యంగా అట్టడుగు వర్గాలకు చెందిన స్త్రీలు చదువుకొనేందుకు ఆమె పాఠశాలలు సైతం ప్రారంభించారని, ఆమె విప్లవ ప్రసంగాలు ఆనాటి మహిళల్లో ఎందరికో స్ఫూర్తిని కలిగించాయని అన్నారు.ఈ కార్యక్రమంలో విడదల గోపి,మునిసిపల్ చైర్మన్ షేక్ రఫాని,మార్కెట్ యార్డ్ చైర్మన్ మద్దిరాల విశ్వనాధం,పట్టణ అధ్యక్షుడు పఠాన్ తలహ ఖాన్,రాష్ట్ర ముస్లిం కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ దరియా వలి,రాష్ట్ర 15 వ ఆర్థికసంఘం మెంబర్ వడితే కోట నాయక్,ప్రధాన కార్యదర్శి మారుబోయిన నాగరాజు,సొసైటీ అధ్యక్షుడు తోట బ్రహ్మాస్వాములు,యస్.సి సెల్ అధ్యక్షుడు బండారు వీరయ్య,కౌన్సిలర్లు బిట్రా రాజేంద్ర,బేరింగ్ మౌలాలి,మార్కెట్ యార్డ్ డైరెక్టర్ రాచపూడి వెంకట్,పార్టీ నాయకులు నిడమానూరు సాంబశివరావు,ఉప్పల భాస్కర్,వంకదారి పుల్లయ్య,నకిరికంటి శ్రీకాంత్,బొజ్జ శివకోటి,చెరుకుపల్లి ప్రసాద్,గుంజి పద్మావతి,షేక్ కరీముల్లా,ఊసా రమేష్,సుదర్సనం వెంకయ్య,సాపా సైదవలి,అన్నపురెడ్డి ఈశ్వర్,రంజిత్,ఇక్కుర్తి పవన్,షేక్ నాగూర్,పుల్లగూర భరత్,మరియు పలువురు పాల్గొన్నారు.

  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: భారతదేశ చరిత్రలోనే సామాజిక విప్లవకారుడిగా ఘనతకెక్కిన జ్యోతిబా ఫూలే సతీమణి సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా.. Rating: 5 Reviewed By: chilakaluripetalocalnews