భారతీయ ఆధ్యాత్మిక సాంస్కృతిక నైపుణ్య రంగాలను నేటితరానికి పరిచయం చేయటమేగాక వారి ఉన్నతికి తోడ్పాటు అందించే విధంగా భగవద్గీత పఠనాభ్యాసం కరాటే కర్రసాములలో గాంధీ క్లబ్స్ ద్వారా శిక్షణ అందించడం జరిగిందని క్లబ్ చైర్మన్ ఘంటసాల బంగారుబాబు తెలిపారు.
మన దైనందిన జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకు చక్కటి పరిష్కార మార్గాన్ని భగవద్గీత చూపడమేగాక ఉన్నతమైన వ్యక్తులతో సమాజం తీర్చిదిద్ద బడుతుందని బంగారుబాబు గారు తెలిపారు .దీని కొరకై శ్రీ రామకృష్ణ సేవాసమితి అధ్యక్ష్యులు శ్రీ చేబ్రోలు శ్రీనివాసరావు గారిచే ఎనభై మంది ఐద్యార్ధిని విద్యార్థులకు ఈ వేసవి సెలవుల్లో ఉచితంగా భగవద్గీత పఠనాభ్యాసం గావించిన పిమ్మట పోటీపరీక్షలు నిర్వహించి మెమొంటోస్ ప్రైజెస్ ప్రశంసాపత్రాలు గాంధీ క్లబ్స్ భగవద్గీత వారిచే అందించడం జరిగింది .
దేహధారుడ్యానికి, ఆత్మస్థైర్యానికి, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుదలకు తోడ్పాటు నందించే కరాటే నందు నలభై మంది విద్యార్థిని విద్యార్థులకు మోడరన్'స్ గ్రీన్ వ్యాలీ స్కూల్ నందు గాంధీ క్లబ్స్ ఇంటర్నేషనల్ వారిచే, బ్లాక్ బెల్ట్ ౭ డాన్ కరాటే మాస్టర్ బి.రాజా గారిచే వేసవి సెలవుల్లో శిక్షణ ఇప్పించి, వారికీ మెమొంటోస్ మరియు
ప్రశంసా పత్రాలు 28-05-2024 న అందించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా గాంధీయన్ చిలకల వెంకట్ గారు ( సేల్స్ టాక్స్ అండ్ ఇన్కమ్ టాక్స్ కన్సల్టెంట్ ), గాంధీయన్ పసుమర్తి సత్యనారాయణ
(గాంధీ క్లబ్స్ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్ష్యులు), టి .మణిదీప్
(ఆర్యవైశ్య యువజన సంగం ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్ష్యులు), గాంధీయన్ ఆలపాటి పాండురంగారావు (గాంధీ క్లబ్స్ లైఫ్ మెంబెర్), తుర్లపాటి శ్రీనివాసరావు (కరాటే అసోసియేషన్ ప్రెసిడెంట్ ), బూదాటి వెంకటేశ్వర్లు, మద్ది గుర్నాధం (గాంధీ క్లబ్స్ లైఫ్ మెంబెర్), 120 మంది విధ్యార్థినీవిధ్యార్దులు మరియు వారి తల్లిదండ్రులు హాజరై కార్యక్రమాన్ని దిగ్విజయం గావించారు.
0 comments:
Post a Comment