*పనిచేయని ఏటీఎం క్యాష్ డిపాజిట్ మిషన్లకు మరమ్మత్తులు నిర్వహించండి లేదా కొత్తవి ఏర్పాటు చేయండి.. ప్రజా మ్యానిఫెస్టో కమిటీ కన్వీనర్ మాదాసు భాను ప్రసాద్..*
పట్టణంలోని నరసరావుపేట సెంటర్లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బిల్డింగ్ లో నున్న ఏటీఎం (ATM) క్యాష్ డిపాజిట్ మిషన్లు పని చేయకపోవడం వలన బ్యాంకు ఖాతాదారులు అసౌకర్యానికి గురవుతున్నారని సంబంధిత అధికారులు వెంటనే స్పందించి నూతన ఏటీఎం మిషన్ల ఏర్పాటు చేయడం గానీ లేదా ఉన్నవాటికి మరమత్తులు చేసి ఖాతాదారులకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.
బ్యాంకు ఖాతాదారులు నగదు చెల్లింపుల్లో జాప్యం జరిగితే అదనపు చార్జీలు వసూలు చేసే బ్యాంకులు, సేవలు అందించడంలో వైఫల్యం చెందితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. చాలా ఏటీఎం సెంటర్లలో ఏటీఎం మిషన్లు పనిచేయకపోవడం, ఆయా సెంటర్లో వున్న ఎయిర్ కండిషనర్స్ పనిచేయకపోవడం పరిపాటిగా మారిందని సేవలకు నగదు వసూలు చేసే అధికారులు ఖాతాదారుల ఇబ్బందులు గురించి పట్టించుకోకపోవడం దురదృష్టకరమైన అన్నారు. ఇప్పటికైనా స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరారు..
0 comments:
Post a Comment