"తెలుగుదేశం పార్టీ"ఆవిర్భావం నుంచి "నటరత్న"నందమూరితో కలిసి నడిచిన"రంగస్థలరత్న"విడదల సాంబశివరావు జీవితం ఆల్బంలో నిక్షిప్తమైన ఓ మధురమైన జ్ఞాపకం. కోట్లాది తెలుగు ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయిన ఆ మహానటుడు 101వ జయంతి సందర్భంగా నా హృదయ నివాళి.
*రాష్ట్రంలో వాయుగుండం హెచ్చరిక బలంగానే కనిపిస్తోంది..*
కానీ ఏ ఏ జిల్లాలు అలర్ట్ గా ఉండాలి అనేది చాలా ముఖ్యం. ప్రస్తుత పరిస్ధితులను చూస్తూ ఉంటే భారీ నుంచి అతిభారీ వర్షాలు అక్టోబర్ 15 - 18 మధ్యలో తిరుపతి - నెల్లూరు - ప్రకాశం జిల్లాల మీదుగా అత్యథికంగా ఉండనుంది.
కొన్ని చోట్లల్లో అతిభారీ వర్షాలు లేదా తీవ్రమైన వర్షాలు పడేందుకు కూడ పరిస్ధితులు చాలా అనుకూలంగా ఉంది. మరో వైపున అన్నమయ్య, వైయస్ ఆర్ కడప, చిత్తూరు, అనంతపురం, సత్యసాయి, బాపట్ల, కృష్ణా, గుంటూరు, పల్నాడు, పశ్చిమ గోదావరి, కొనసీమ, కాకినాడ జిల్లాల్లో కూడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనుంది.
*అలాగే అక్టోబర్ 16 - 18 మధ్యలో అనకాపల్లి - వైజాగ్ - శ్రీకాకుళం - విజయనగరం - తూర్పు గోదావరి - ఏలూరు - ఎన్.టీ.ఆర్. జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడనుంది..*
వాయుగుండం కోస్తా ప్రాంతానికి దగ్గరగా వచ్చి బలహీన పడనుంది.
దీని వలన కోస్తా భాగాల్లో ఎక్కువ వర్షాలుంటాయి.
వాయుగుండం బలహీన పడి అల్పపీడనంగా రాయలసీమలోకి వెళ్లనుంది.
దీంతో రాయలసీమలో కూడ భారీ వర్షాలుండే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ...
రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు అమలు కోసం ఏర్పాటైన ఏక సభ్య న్యాయ కమిషన్ చైర్మన్ గా తెలంగాణ హైకోర్టు మాజీ జడ్జి డాక్టర్ జస్టిస్ షహీమ్ అఖ్తర్ గారిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
ఎస్సీ వర్గీకరణ అమలు చేయడంలో ఎలాంటి చిక్కులు తలెత్తకుండా జస్టిస్ షహీమ్ అఖ్తర్ గారి కమిషన్ వచ్చే 60 రోజుల్లోగా సమగ్ర అధ్యయనం పూర్తి చేయాల్సిఉంది.
రెండు రోజుల కిందట ఎస్సీ వర్గీకరణ అంశాన్ని సమీక్షించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గ ఉపసంఘం సూచనల మేరకు తక్షణం హైకోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో ఏకసభ్య న్యాయ కమిషన్ను నియమించాలని, 24 గంటల్లోగా కమిషన్కు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించడం తెలిసిందే.
0 comments:
Post a Comment