శ్రీ దత్త సాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు భక్తులకు అన్నదాన కార్యక్రమం---- చిలకలూరిపేట సుబ్బయ్య తోట శ్రీ దత్త సాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేంచేసి ఉన్న శ్రీ దత్త సాయి సన్నిధిలో గురువారం సప్తమి అలాగనే అష్టమి తిధి రెండూ కలిసి ఉన్న రోజున ఈరోజు ఉదయాన్నే బాబా గారికి ప్రత్యేక అభిషేక పూజ అలంకార అష్టోత్తర శతనామ పూజా కార్యక్రమాలు అమ్మవారికి కుంకుమ పూజా కార్యక్రమాలు, భక్తులు బాబాకి ప్రదక్షణ కార్యక్రమం జరిగింది .అనంతరం ప్రతి గురువారం అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈరోజు పోతుగంటి హనుమయ్య గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యుల యొక్క ఆర్థిక సహాయ సహకారాలతో భక్తులకు అన్నదాన కార్యక్రమం జరిగింది ట్రస్ట్ చైర్మన్ పూసపాటి బాలాజీ మాట్లాడుతూ ఇక్కడ జరిగే అన్నదాన కార్యక్రమానికి భక్తులు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులు కొత్తూరి హనుమంతరావు గారు అయినవోలు హనుమంతరావు తదితరులు పాల్గొని భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని పరివేక్షించారు
Thursday, May 30, 2024
- Blogger Comments
- Facebook Comments
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment