అనారోగ్యంతో మృతి చెందిన వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం
చిలకలూరిపేట:గణపవరం అంబేద్కర్ కాలనీకి చెందిన పాకాల సావిత్రి భర్త అక్కిరాజు అనారోగ్యంతో బుధవారం రాత్రి మృతి చెందారు. అదేవిధంగా రాజీవ్ గాంధీ కాలనీ చెందిన కొలికి పెద్ద అంజయ్య మాతృమూర్తిరాలు నాసరమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. వారి కుటుంబాలకు రాష్ట్ర కార్మిక, రైతాంగ పరిరక్షణ సమితి, ఏపీ గిరిజన సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి మట్టి ఖర్చులు నిమిత్తం ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక, రైతాంగ పరిరక్షణ సమితి సింగు లెనిన్ బాబు, ఏపీ గిరిజన సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు బి. శ్రీను నాయక్,పరిరక్షణ సమితి ఉపాధ్యక్షులు ప్రత్తిపాటి చిన్న, నాయకులు గోను చిరంజీవి,మేకతోటి శివాజీ.తాళ్లూరి వెంకట్,తోపాటు పలువురు పాల్గొన్నారు.
0 comments:
Post a Comment