728x90 AdSpace

NAVATHARAM NEWS

Followers

Latest News

మల్లెల శివ నాగేశ్వర రావు .నేషనల్ ప్రెసిడెంట్ కేసరి యాక్టీవ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్

Friday, May 31, 2024

ర్యాలీలకి ఎటువంటి అనుమతి లేదు





*సోషల్ మీడియా లో రాజకీయ పార్టీ ల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వీడియో పెట్టిన వ్యక్తి కి రిమాండు., సోషల్ మీడియాలలో ఎటువంటి విద్వేషాలు రెచ్చగొట్టే సందేశాలు,ఫోటోలు,వీడియోలు పోస్టు చేస్తే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం ఈ నేరాలలో గ్రూప్ అడ్మిన్స్ దే పూర్తి భాద్యత- పల్నాడు జిల్లా ఎస్పీ  మతి మలిక గర్గ్  ఐపీఎస్*

పల్నాడు జిల్లా నరసరావుపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక వ్యక్తి మరొక వ్యక్తిని సోషల్ మీడియాలో అసభ్యకరంగా తిడుతూ, రాజకీయ పార్టీల గురించి ప్రస్తావిస్తూ పార్టీల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడి వీడియో పెట్టినాడని రిపోర్టు ఇవ్వగా దానిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో భాగంగా సదరు విద్వేషకరమైన వీడియోని పెట్టిన విషయమై జిల్లాలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను ప్రస్తావిస్తూ వ్యక్తికి  రిమాండ్ తీసుకుని జైలుకు పంపడం జరిగినది.ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ,సోషల్ మీడియా లేదా వాట్సాప్ లలో రేపు రాబోవు ఎగ్జిట్ పోల్స్ తరువాత ఎటువంటి విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు పెట్టరాదని ఎవరైనా అటువంటి సందేశాలు, ఫోటోలు,వీడియోలు పంపిన యెడల గ్రూప్ అడ్మిన్స్ దే పూర్తి భాద్యత అని తెలియచేస్తూ, అటువంటి వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడునని హెచ్చరించారు.అదేవిధంగా సత్తెనపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక రౌడీషీటర్ ఒక రాజకీయ పార్టీ ఆఫీసు వాచ్ మెన్ పై దాడి చేసి చేతులతో కొట్టి పార్టీ ఆఫీసును తగుల పెడతానని బెదిరించిన విషయమై  అతనిపై కేసు నమోదు చేసి అతని యొక్క పూర్వ నేరాలను ప్రస్తావిస్తూ రిమాండ్ తీసుకొని అతనిని జైలుకు పంపించడం జరిగినది. ఈ విషయమై నేర చరిత్ర ఉన్న ఏ ఒక్కరైనా అదుపుతప్పి ప్రవర్తిస్తూ, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని వారిపై PD యాక్ట్ పెట్టడం అవరమైతే జిల్లా బహిష్కరణ కూడా చేస్తామని ఈ సందర్భంగా శ్రీ ఎస్పీ గారు నేరస్తులను హెచ్చరించారు.  అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉన్నందున రేపు అనగా 01.6.2024 తేదీ *హనుమాన్ జయంతి* సందర్భంగా ఎటువంటి ర్యాలీలు, మైకులకు, సాంస్కృతి కార్యక్రమాలకు పర్మిషన్ లేదని, ప్రజలు గుడిలో మాత్రమే స్వామి వారికి పూజలు నిర్వహించుకోవాలని, దీనిని దృష్టిలో వుంచుకుని ప్రజలందరూ సహకరించాలి అని తెలియచేశారు.
 జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉన్నందున రేపు అనగా 01.6.2024 సాయంత్రం 5 గంటల నుంచి జిల్లా వ్యాప్తంగా అన్ని వాణిజ్య, వ్యాపార కార్యక్రమాలను (షాపులు)మూసివేయాలని తెలియచేశారు. వ్యాపారులు పోలీసు వారికి సహకరించాలని కోరారు. ప్రజలు కూడా ఎక్కడ గుమికూడరాదని ఏదైనా అత్యవసరమైతేనే బయటికి రావాలని మీకు కావాల్సిన సరుకులను ఇతర వస్తువులను  రేపు సాయంత్రం కల్లా తీసుకొని, బయటకు రాకుండా ఇంట్లోనే ఉండి  పోలీసు వారికి శాంతి భద్రతల విషయంలో సహకరించాలని తెలియజేయడమైనది.
  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: ర్యాలీలకి ఎటువంటి అనుమతి లేదు Rating: 5 Reviewed By: chilakaluripetalocalnews