TDP ఏజెంట్ కు చంద్రబాబు ఫోన్ కాల్
మాచర్ల : పాల్వాయి గేట్లో ఈవీఎంను ధ్వంసం చేస్తున్నప్పుడు అడ్డుపడి, గాయపడిన TDP ఏజెంట్ నంబూరి శేషగిరిరావుకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కాల్ చేశారు. ఈ సందర్భంగా అతని ఆరోగ్య పరిస్థితిపై ఆయన ఆరా తీశారు. ధైర్యంగా ఉండాలని, పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఎమ్మెల్యేపై కేసు నమోదు, అరెస్ట్ వార్తల నేపథ్యంలో శేషగిరిరావు అజ్ఞాతం వీడి ఇవాళ బయటికొచ్చారు. ఈ క్రమంలో ధైర్యంగా పోరాడవని చంద్రబాబు ఆయనను అభినందించారు.
0 comments:
Post a Comment