జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు , జనసేన పార్టీ 21 మంది ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా చిలకలూరిపేట పట్టణంలోని 32 వ వార్డు, మార్కండేయ నగర్ కోదండ రామాలయం వద్ద జనసేన పార్టీ సిద్ధాంతంలోని పర్యావరణ పరిరక్షణలో భాగంగా 32 వ వార్డు జనసైనికులు, వీర మహిళలు కలిసి మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చిలకలూరిపేట నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త తోట రాజా రమేష్ పాల్గొని మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా రాజ రమేష్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, అటవీ మరియు పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ, గ్రామీణ త్రాగునీటి శాఖలు తీసుకోవటం వలన రాష్ట్రంలోని గ్రామీణ అభివృద్ధికి పూర్తిస్థాయి నూతన ప్రణాళికలు రూపొందిస్తారని తద్వారా రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని, పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు అనే నానుడు నెరవేరుతుందని అని అన్నారు. పోటీ చేసిన జనసేన పార్టీ అభ్యర్థులు 21 మంది గెలుపొంది నేడు శాసనసభలో అడుగు పెట్టడం దేశ చరిత్రలో అరుదైన ఘట్టంగా భావించవచ్చునని అన్నారు. రానున్న కాలంలో రాష్ట్ర ప్రభుత్వంలో జనసేన పార్టీ క్రియాశీలకంగా వ్యవహరిస్తుందని అన్నారు. కొందరు మాజీ మంత్రులు అసెంబ్లీ గేటు కూడా మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారిని తాకనీయము అని ప్రగల్ బాలు పలికిన మాజీ మంత్రులను అసెంబ్లీకి పానివ్వకుండా మా జన సైనికులు చిత్తుచిత్తుగా ఓడించారనీ అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు షేక్ మునీర్ హసన్, కూరపాటి శివశంకర్, గోలి నరసింహారావు, సాంబ, రాజేష్, వెంకటేష్ , వెంకటస్వామి వీర మహిళలు అరుణ, మల్లీశ్వరి, కల్పన, రమాదేవి తదిరులు పాల్గొన్నారు.
0 comments:
Post a Comment