*మున్సిపల్ వర్కర్స్ నూతన కార్యవర్గ ఎంపిక*
చిలకలూరిపేట: మున్సిపల్ కార్మికులు సమైక్యంగా ఉండి సమస్యలు పరిష్కరించుకోవాలని సీపీఐ ఇన్‌చార్జి ఏరియా కార్యదర్శి నాగబైరు రామ సుబ్బాయమ్మ పిలుపు నిచ్చారు. మంగళవారం ఏఐటీయూసీ అనుబంధ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ , చిలకలూరిపేటశాఖ నూతన కమిటీని ఎన్నుకున్నారు. యూనియన్ అధ్యక్షుడిగా వేల్పుల అంజియ్య, సభ్యులుగా వాడపల్లి దేవసహాయం, యాకసిరి నారాయణ, ఆవుల పోతురాజు, వేముల శివయ్య, బెల్లంకొండ గంగాధర్ లను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న సుబ్బాయమ్మ మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల సమస్యలను సానుభూతితో అర్దం చేసుకొని , వారి న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరారు.
పర్మినెంట్ పారిశుద్ధ ఇంజనీరింగ్ కార్మికుల జిపిఎఫ్ ఖాతాలు సాంకేతిక సమస్యలు అంటూ ప్రభుత్వం వాయిదాలు వేయకుండా సత్వరం చెల్లించాలని,సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని,అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వర్కర్లు విధులలో మరణిస్తే రూ. 30 లక్షలు ప్రమాదం జరిగితే రూ. 10 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు.పారిశుధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని గతం నుంచి తాము ఎన్నో పోరాటాలు చేశామని, పనిముట్లు లేక ఇబ్బందులు పడుతున్నారని కనీసం మరమత్తుకు గురైన పుష్‌కాట్ల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాలని పలుమార్లు కోరినా ఫలితం లేదన్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ ఏరియా అధ్యక్ష, కార్యదర్శులు పేలూరు రామారావు, దాసరి వరహాలు, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు తాళ్లూరి బాబురావు, ఏపీ మహిళా సంఘం ఏరియా కార్యదర్శి చెరుకుపల్లి నిర్మల, నాయకులు చెంచయ్య తదితరులు పాల్గొన్నారు.
0 comments:
Post a Comment