*సీఎం చంద్రబాబును కలిసిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు*
రాష్ట్ర తొలి మంత్రివర్గ సమావేశంలోనే ముఖ్యమంత్రి మొదటిరోజు చేసిన అయిదు సంతకాలకు ఆమోదంతో నవశకానికి నిజమైన ఆరంభం పలికారని హర్షం వ్యక్తం చేశారు మాజీమంత్రి, చిలక లూరి పేట తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు. అయిదుసంతకాలకు ఆమోదంతో పాటు ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ పేరు పునరుద్ధరించాలన్న నిర్ణయంతో తెలుగువారి ఆత్మగౌరవాన్ని కూడా కాపాడారని ముఖ్యమంత్రి, మంత్రిమండలికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర తొలి మంత్రివర్గ సమావేశం సందర్భంగా సోమవారం పల్నాడు జిల్లా సహచర ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు ప్రత్తిపాటి. అనంతరం ఆయన మాట్లా డుతూ రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల మందికి 1వ తేదీనే రూ.7వేల చొప్పున ఇంటికే పింఛను అందించ డం ద్వారా భారతదేశ సంక్షేమచరిత్రలోనే కూటమి ప్రభుత్వం కొత్త రికార్డు సృష్టించనుందన్నారు. ప్రజలకు ఇచ్చిన మాటను, అంతేస్ఫూర్తితో నిలబెట్టుకుంటున్న ఇలాంటి ప్రభుత్వం భాగస్వామి అయినందుకు ఎంతో గర్వపడుతున్నట్లు తెలిపారు ప్రత్తిపాటి. అంతకు ముందు సహచర ఎమ్మెల్యే లతో నూతన డీజీపీని కలసి శుభాకాంక్షలు తెలిపామని,.. పల్నాడుల్లో ఎన్నికల అనంతరం పరిస్థితులు వివరించి తగిన చర్యలు తీసుకోవాలని కోరినట్లు ఈ సందర్భంగా వెల్లడించారు ప్రత్తిపాటి పుల్లారావు.
0 comments:
Post a Comment