728x90 AdSpace

NAVATHARAM NEWS

Followers

Latest News

మల్లెల శివ నాగేశ్వర రావు .నేషనల్ ప్రెసిడెంట్ కేసరి యాక్టీవ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్

Saturday, June 29, 2024

కల్కి అవతారం ఎప్పుడు వస్తుంది




కల్కి అవతారం ఎప్పుడు వస్తుంది ............!!

కృతయుగం నుండి  ఇప్పటివరకు శ్రీమహావిష్ణువు తొమ్మిది అవతారాలు ఎత్తడం జరిగినది. 
కృష్ణావతారం తరువాత కావలసిన రావలసిన అవతారం కల్కి అవతారం దశావతారములలో ఇది ఒకటి. కల్కిఅవతారం రాలేదు కానీ వ్యాస వాక్కు ప్రమాణం.వ్యాసుడు చెప్పాడు కాబట్టి ప్రమాణం. 

పదవ అవతారమైన కల్కి అవతారం ఎప్పుడు వస్తుందో వ్యాసభగవానుడు చెప్పాడు.

1. అసలు ఎక్కడా స్వాహాకారము శత్కారము ఇవి రెండూ కనబడవు అంటే ఇక యజ్ఞ యాగములు ఉండవు.

2. గోవులు విశేషంగా వదింపబడి గో మాంసం తినడం లోకం లో ప్రారంభం అవుతుంది. 

3. వివాహ వ్యవస్థ నిలబడదు

4. తల్లిదండ్రులను చూసే బిడ్డలు ఉండరు

5. భర్తను గౌరవించే భార్య భార్యను గౌరవించే భర్తను చూసే వాళ్లు లోకంలో ఉండరు

6. పురుషుల యొక్క ఆయుర్దాయం 18 సంవత్సర
ములకే పడిపోతుంది

7.స్త్రీలు కేశపాశము లు విరబోసుకుని తిరగడం లోకంలో పెద్ద విశేషం అయిపోయి జడ వేసుకునే సంప్రదాయం విచ్ఛిన్నమవుతుంది

8. పురుషులు 18 సంవత్సరముల కే మరణించడం ప్రారంభం అయిపోయి ఆయుర్థాలు క్షీణించిన తరువాత ఆ సమయంలో " శంభాలా " అనేటువంటి గ్రామంలో విష్ణు యశస్సు అనే  బ్రాహ్మణ కడుపున కల్కి పేరుతో శ్రీ మహావిష్ణువు 10 వ అవతారంగా వస్తాడు.  🙏
  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: కల్కి అవతారం ఎప్పుడు వస్తుంది Rating: 5 Reviewed By: chilakaluripetalocalnews