*శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి కల్యాణోత్సవంలో పాల్గొన్న ప్రత్తిపాటి*
మాజీముఖ్యమంత్రి జగన్‌రెడ్డి చేసిన తప్పులు తెలుసుకుంటే ఇప్పటికైనా అతడికే మేలని హితవు పలికారు మాజీమంత్రి, చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు. చేసిన పాపాలతో.. వై నాట్ 175 అని విర్రవీగి న పరిస్థితుల నుంచి ప్రతిపక్ష హోదాను ఇవ్వమని అడుక్కుని స్థాయికి పడిపోయిన అతడికి ఇంకా కనువిప్పు కలగకపోవడమే ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు ప్రత్తిపాటి. దేవతల రాజధాని అమరావతిలానే కలకాలం వర్థిల్లాలని అదే పేరుతో ప్రారంభించిన అమరావతి నగరం విధ్వంసం చేయాలన్న దుర్భుద్ధి పుట్టిన రోజే జగన్ నేటి దుస్థితికి నాంది పడిందన్నారు ఆయన. తర్వాత మూడు రాజధానుల పేరిట మొదలు పెట్టిన నాటకాలు, ఆడిన అబద్ధాలు, చేసిన మోసాలు ఇప్పటికైనా ఒక్కసారి గుర్తుతెచ్చుకోవాలన్నారు. శుక్రవారం చిలకలూరిపేట పట్టణం పెదనందిపాడు రోడ్డులోని దాసరి కాలనీలో శ్రీ కనకదుర్గ అమ్మవారి 30వ తిరునాళ్లలో ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. స్వామిఅమ్మవార్లకు ప్రత్తిపాటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేదాశీర్వచనం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం మాట్లాడిన ప్రత్తిపాటి తప్పు చేస్తే దేవుడు చూస్తాడు, శిక్షిస్తాడన్న కనీస పాపభీతి అనాదిగా సమాజాన్ని ఒక దారిలో నడిపిస్తోందని, దానికి అతీతంగా ప్రవర్తించేజగన్ లాంటివాళ్లు ఎప్పటికైనా చేసిన ఘోరా లకు శిక్షలు అనుభవించక తప్పదన్నారు. అధికారం కోల్పోవడం అందులో మొదటి దశ మాత్ర మేనని, జగన్ అనుభవించాల్సిన శిక్షలు, చెల్లించాల్సిన మూల్యాలు మున్ముందు చాలా ఉన్నా యన్నారు ప్రత్తిపాటి పుల్లారావు.
0 comments:
Post a Comment