జూన్-4 ఫలితాల్లో రాబోతున్నది కూటమి ప్రభంజనమే అని స్పష్టం చేశారు మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు. ఎగ్జిట్ పోల్స్‌ను మించిన సీట్లు, ఆధిక్యాలతో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడు వైకాపా పాలనకు అసలైన కౌంట్‌డౌన్ మొదలైందని, ఫలితాల సునామీలో ఆ పార్టీ పూర్తిగా తుడిచి పెట్టుకుపోవడం ఖాయమన్నారు. మరో మూడు రోజుల్లోనే రాక్షస పాలన నుంచి ప్రజలకు స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు లభించబోతున్నాయని హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం విడుదలైన ఎగ్జిట్ పోల్స్‌లో మెజార్టీ సర్వేలు కూటమికే బ్రహ్మరథం పట్టడం ప్రజానాడిని, వైకాపా పాలన పట్ల వాళ్లు ఎంత విసిగి పోయారో అనే దానికి అద్ధం పట్టాయన్నారు ప్రత్తిపాటి. తెలుగుదేశం, జనసేన, భాజపా కూటమికి ఎదురులేదని, ఆ పొత్తు ఖాయమైన రోజే వైకాపా పతనానికి నాంది పడిందని తాము ఇన్నిరోజలుగా చెబుతున్నదే నిజమైందన్నారాయన. చిలకలూరిపేట నియోజకవర్గానికి సంబంధించి అధికార వైకాపా ఎన్నికలకు ముందే చేతులెత్తేసిందని, తుది ఫలితాల్లోనూ అదే ప్రస్ఫుటంగా కనిపిస్తుందన్నారు ప్రత్తిపాటి. తనపై ఎంతో నమ్మకం ఉంచి నియోజవర్గం చరిత్రలోనే అత్యధిక ఆధిక్యంతో విజయం అందించబోతున్న చిలకలూరిపేట ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటామని, ఎన్నికల్లో వారికిచ్చిన హామీలన్నీ నెరవేర్చడమే ఇక తమ ప్రాధాన్యాలుగా పెట్టుకుంటామన్నారు ప్రత్తిపాటి.
Sunday, June 2, 2024
- Blogger Comments
- Facebook Comments
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment