*నవతరం పార్టీ "ప్రజావారధి"జులై 16 ప్రారంభం - జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం*
*ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అన్న ఎన్టీఆర్ స్ఫూర్తితో నవతరం పార్టీ "ప్రజావారధి" పేరుతో కార్యక్రమాన్ని చేపట్టినట్లు జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం తెలిపారు 2024 జూలై 16వ తేదీ నుండి ప్రజావారధి కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని తెలిపారు.నవతరం పార్టీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలని మద్దతు ప్రకటించిన తర్వాత సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి విజయదుందుభి మోగించిన విషయం తెలిసిందే అని రావు సుబ్రహ్మణ్యం అన్నారు. రాష్ట్రంలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసమే ప్రజావారధి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు రావు సుబ్రహ్మణ్యం తెలిపారు.నవతరం పార్టీ దృష్టికి ప్రజావారధి ద్వారా వచ్చిన అన్ని సమస్యల్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు రాజమండ్రి లోక్ సభ సభ్యురాలు దగ్గుపాటి పురందరేశ్వరి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తామని బుధవారంసాయంత్రం చిలకలూరిపేట కార్యాలయంలో ప్రకటన విడుదల చేశారు.*
0 comments:
Post a Comment