చిలకలూరిపేట పట్టణంలో ఎస్టీయూ ప్రాంతీయ కార్యాలయం లో జరిగిన సమావేశం లో రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కే కోటేశ్వరరావు మాట్లాడుతూ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 25 వేల మంది ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు ఉపాధ్యాయులుపనిచేస్తున్నారు. వీరికి రెండు నెలలుగా (మే నెల జూన్ నెల)జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అని అన్నారు కావున రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి జీతాలు జమ చేయాలని కోరారు.రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర పూర్వ కార్యదర్శి పోటు శ్రీనివాసరావు మాట్లాడుతూ 9వ తేదీ దాటినా ఇప్పటికి జీతాలు జమ చేయలేదని అన్నారు.మండల విద్యా వనరుల కేంద్రంలో పని చేస్తున్న అటెండర్,యం.ఐ.యస్ కోఆర్డినేటర్స్. అకౌంటెంట్స్, ఆర్ట్,క్రాఫ్ట్ టీచర్లు కస్తూరీబాగాంధీ బాలికల పాఠశాల లో పనిచేస్తున్న ప్రిన్సిపల్స్ ,టీచర్స్ సిబ్బంది అందరూ ఇరవై వేల మంది కి పైగా వుంటారని వారి కుటుంబాలు ఈ జీతాల పై ఆధారపడి ఉంటాయి కావున రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రి గారు చొరవ చూపించి వారికీ జీతాలు అందించాలి అని కోరారు. కుటుంబ ఖర్చులు పిల్లల చదువు ఫీజులు. భారంగా మారాయని వారు కోరుతున్నారని అన్నారు.ఈ సమావేశం లోపల్నాడు జిల్లా కార్యదర్శి వినుకొండ.అక్కయ్య, జిల్లా కౌన్సిలర్ షేక్ జమీర్ బాషా.సీనియర్ నాయకులు చావలి మల్లేశ్వరరావు. చిలకలూరిపేట పట్టణ అధ్యక్షులు మేకల కోటేశ్వర రావు ప్రధాన కార్యదర్శి వడ్లాన.జయప్రకాష్. పట్టణ నాయకులు ఇనకోల్లు అంకమ్మారావు.పి సాగర్ బాబు. కె ఏడుకొండలు. యం చిన వేంకట స్వామి. సొమ్ల నాయక్. అట్లూరి శ్రీనివాసరావు. ఫరిసా తదితరులు పాల్గొన్నారు.
Tuesday, July 9, 2024
- Blogger Comments
- Facebook Comments
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment