*నవతరంపార్టీ "ప్రజావారధి"కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరించిన తెలుగుదేశం పార్టీ రాజకీయ కార్యదర్శి టిడి జనార్ధన్.*
*ప్రెస్ నోట్ :: మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం.*
*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సమస్యలు పరిష్కారం కోసం నవతరంపార్టీ ఆధ్వర్యంలో జూలై 16 న చేపట్టనున్న ప్రజావారధి అధ్బుతమైన కార్యక్రమం అని తెలుగుదేశం పార్టీ రాజకీయ కార్యదర్శి టిడి జనార్ధన్ అన్నారు. ప్రజలు ప్రభుత్వం మధ్య వారధిగా నిలిచేందుకు ముందుకు వచ్చిన నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం చొరవ అభినందనీయం అన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ప్రజల సమస్యలు పరిష్కారం విషయంలో అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని టిడి జనార్ధన్ తెలిపారు.కూటమి ప్రభుత్వం సమస్యలు పరిష్కారం కోసం ముందుకు వచ్చిన నవతరం పార్టీ ప్రజావారధి కార్యక్రమాన్ని స్వాగతి స్తుందని తెలిపారు.13-07-2024 మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో కార్యక్రమం పోస్టర్ నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం తెలుగుదేశం పార్టీ రాజకీయ కార్యదర్శి టిడి జనార్ధన్ కలసి మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు.కార్యక్రమంలో నవతరం పార్టీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి ఎండ్రెడ్డి శివారెడ్డి పాల్గొన్నారు.*
0 comments:
Post a Comment