728x90 AdSpace

NAVATHARAM NEWS

Followers

Latest News

మల్లెల శివ నాగేశ్వర రావు .నేషనల్ ప్రెసిడెంట్ కేసరి యాక్టీవ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్

Sunday, July 14, 2024

కూటమి ప్రభుత్వంలో వ్యాపార వర్గాలకు స్వేచ్ఛ





*కూటమి ప్రభుత్వంతో వ్యాపారవర్గాలకు స్వేచ్ఛా వాతావరణం: ప్రత్తిపాటి*

*శ్రీ వెంకటేశ్వర ఆర్యవైశ్య కల్యాణ మండపం నూతన కమిటీకి ప్రత్తిపాటి అభినందనలు*


అయిదేళ్ల అరాచక వైకాపా పాలన పోయి ప్రజాప్రభుత్వం ఏర్పడడంతో  రాష్టవ్యాప్తంగా వ్యాపార వర్గాలు స్వేచ్ఛగా వర్తక, వాణిజ్యాలు చేసుకునే పరిస్థితులు నెలకొన్నాయన్నారు మాజీమంంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ప్రత్తిపాటి. పై నుంచి కింది స్థాయి నేతల వరకు కప్పాలు కట్టి కట్టీ అలసిపోయిన వ్యాపారులు ఇప్పుడు ఎలాంటి భయాలు లేకుండా వ్యాపారాలు చేసుకుం టున్నారని, రానున్న రోజుల్లో రాష్ట్రంలోసానుకూల వాతావరణం, పెట్టుబడుల ఆకర్షణకు వాళ్లే రాయబారులుగా ఉంటారని ఆనందం వ్యక్తం చేశారు. గల్లీల్లోని చిల్లరవ్యాపారుల నుంచి పెద్దపెద్ద వ్యాపారవేత్తల వరకు తమకు స్వేచ్ఛలభించిందని, దాడులు, అవమానాలు లేకుండా గౌరవప్రద ంగా వారి పనులు వారు చేసుకోగలుగుతున్నట్లు చెబుతున్నారన్నారు. ఆదివారం చిలకలూరిపేట శ్రీ వెంకటేశ్వర ఆర్యవైశ్య కల్యాణ మండపం నూతన కమిటీ అధ్యక్షుడు డాక్టర్ ఆరవపల్లి సురేష్ కుమార్, కార్యదర్శి చేవూరు కృష్ణమూర్తి, కోశాధికారి రాజీవ్, సభ్యులు స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావును మర్యాదపూర్వకంగా కలిశారు. నూతనంగా ఎంపికైన వారందరిని ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగానే ఆర్యవైశ్యులు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్న ప్రత్తిపాటి కష్టపడి పనిచేసి వారి అభ్యున్నతికి కృషి చేయాలని సూచించారు.‌ ఆర్యవైశ్యులకు సమాజహితం కోసం పాటుపడతారనే పేరుందని, దానిని మరింత పెంచుకునేలా వారు ముందుకు సాగాలని ఆకాంక్షించారు. సమాజంలోని పేదలు, ఆపదలోఉన్న వారి కోసం సేవా కార్యక్రమాలు నిర్వహించే ఆర్యవైశ్యులకు తన సహాయ సహకారాలు ఉంటాయని చెప్పారు. స్థానికంగా ఆర్యవైశ్యులకు అన్ని విధాలా అండగా ఉంటానని, అందరి సహకారంతో ఆర్యవైశ్య కల్యాణ మండపాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి మంత్రివర్గ సభ్యులంతా సానుకూల దృక్పథంతో ప్రజాశ్రేయస్సుకోసం ఆలో చించే వారు కావడం వల్ల ఎవ్వరూ, ఏ విషయంలోభయపడాల్సిన పని లేదన్నారు ప్రత్తిపాటి పుల్లారావు. స్థానికంగా ఎవరైనా ఇబ్బందిపెట్టాలని చూసినా తానున్నానే భరోసా ఉండాలన్నారు.
  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: కూటమి ప్రభుత్వంలో వ్యాపార వర్గాలకు స్వేచ్ఛ Rating: 5 Reviewed By: chilakaluripetalocalnews