728x90 AdSpace

NAVATHARAM NEWS

Followers

Latest News

మల్లెల శివ నాగేశ్వర రావు .నేషనల్ ప్రెసిడెంట్ కేసరి యాక్టీవ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్

Sunday, July 14, 2024

డాక్టరేట్ పొందిన మోడ్రన్ సంస్థల డైరెక్టర్ మహేష్




అమెరికా దేశంలోని ప్రముఖ విశ్వవిద్యాలయం మేరిల్యాండ్ స్టేట్ యూనివర్శిటీ నుంచి విద్యారత్న చేబ్రోలు మహేష్ కు డాక్టరేట్ 

కేజి నుంచి పిజి వరకు గత నలభై సంవత్సరాలుగా విద్యాసంస్థలను ఏర్పాటు చేసి లక్షలాది మంది విద్యార్ధులకు నాణ్యమైన విద్యను అందిస్తూ పేద మధ్య తరగతి వారికి విద్యారంగంలో విశేష కృషి చేస్తున్న పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన మోడరన్ విద్యాసంస్థల అధినేత విద్యారత్న అవార్డు గ్రహీత డా. చేబ్రోలు  మహేష్ కు అమెరికా దేశంలోని ప్రముఖ విశ్వవిద్యాలయం మేరిల్యాండ్ స్టేట్ యూనివర్శిటీ డాక్టరేట్ ను ప్రధానం చేసింది.

న్యూదిల్లీ లోని ఇండియా హాబిటాట్ సెంటర్,గుల్మొహర్ హాల్ నందు ఆదివారం భారతీయుల కోసం మేరిల్యాండ్ విశ్వవిద్యాలయం  నిర్వహించిన డాక్టరేట్ ప్రధానోత్సవ కార్యక్రమంలో  పి.హెచ్.డి అవార్డును మహేష్ కు అందించారు.

నాదెండ్ల మండలం అప్పాపురం గ్రామానికి చెందిన చేబ్రోలు గుర్నాధం, కామేశ్వరమ్మ దంపతుల ద్వితీయ కుమారుడు చేబ్రోలు మహేష్. చిన్నతనం నుంచి కష్టపడి చదువుకున్నాడు.

1 నుండి 5వ తరగతి వరకు గ్రామంలోని మండల పరిషత్ ప్రాధమిక  పాఠశాలలో, 6నుంచి 10వరకు కావూరు జడ్.పి.ఉన్నత పాఠశాలలో చదువుకుని  ప్రతిభావంతుడైన విద్యార్ధిగా గుర్తింపు పొందాడు.తన కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటూ ప్రతిరోజు అప్పాపురం నుంచి చిలకలూరిపేటకు వచ్చి చదువుకుంటూ ఇంటర్,డిగ్రీ స్థానిక యస్.సి.వి.యస్, డి.ఆర్.యన్.యస్.సి.వి.యస్ కళాశాలలో పూర్తిచేశాడు. 

సి.ఎ తోపాటు  ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి యమ్.కామ్ లో పి.జి. పట్టాను అందుకున్నారు.అనంతరం 1991 లో అధ్యాపకుడిగా భాద్యతలు చేపట్టారు.అందులోను కష్టమైన సబ్జెక్ట్ అకౌంట్స్ చెప్పడం లో తనదైన ముద్రతో విద్యార్ధుల అభిమానాన్ని చూరగొన్నారు.



 "విద్య నూటికి నూరు మార్కులకోసమే కాదు నూరేళ్ళ జీవితం కోసం కూడా" అనే నినాదంతో మోడరన్ విద్యాసంస్థలను 1993లో స్థాపించారు.చిలకలూరిపేటలో తాను స్థాపించిన విద్యాసంస్థలకు సంబంధించి నాణ్యమైన విద్యను అందించడంలో ఎక్కడా రాజీపడకుండా ముందుకు సాగాడు.ఈ నేపధ్యంలోనే అంచెలంచెలుగా ఎదుగుతూ తన సంస్థలో కే.జి నుంచి పి.జి వరకు లక్షలాది మంది విద్యార్ధులకు విలువలతో కూడిన విద్యను అందించేలా కృషి చేశారు.

ఈ కృషిలో మహేష్ సతీమణి చేబ్రోలు సుజాత సహకారం కూడా మరువలేనిది.మహేష్ కు ఇద్దరు పిల్లలు.కుమార్తె ప్రత్యూష విదేశాలలో యమ్.యస్ పూర్తి చేసి ప్రస్తుతం విద్యాసంస్థల డైరెక్టర్ గా భాద్యతలు నిర్వహిస్తున్నారు.కుమారుడు సంతోష్ ప్రస్తుతం ఇంగ్లండ్ లోని ప్రముఖ విశ్వ విద్యాలయంలో యమ్.యస్ చేస్తున్నారు. సంతోష్ రాష్ట్ర,జాతీయ,అంతర విశ్వ విద్యాలయ స్థాయిలలో షటిల్ పోటీలలో ఎన్నో అవార్డులు అందుకున్నారు.

మోడరన్ విద్యాసంస్థలలో చదువుకున్న విద్యార్ధ్లులు ఎంతోమంది  దేశ విదేశాలలో ఉన్నత స్థానాలలో స్థిరపడ్డారు.2007 ఐ.ఎ.యస్ కేడర్ కు చెందిన మైలవరపు వెంకట కృష్ణ తేజ మోడరన్ విద్యాసంస్థలలోనే చదువుకున్నారు. 

ఇలా ఎంతో మంది అమెరికా,ఇంగ్లాండ్,ఆస్ట్రేలియా,జర్మనీ,జపాన్,దుబాయ్,సౌదీ అరేబియా,కువైట్,యుగాండా,మలేషియా,సింగపూర్,స్కాట్లాండ్ తదితర 75కిపైగా దేశాలలో వివిధ రంగాలలో ఉద్యోగాలు చేస్తున్నారు.దీనితో పాటు వ్యాపార రంగంలోను మహేష్ తనదైన విజయ పరంపర కొనసాగించారు.

చిలకలూరిపేట,మార్టూరు,త్రిపురాంతకం,అమలాపురం,కాకినాడ,హైదరాబాద్ తదితర ప్రాంతాలలో తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు.ప్రధానంగా విద్యారంగంలో ఎనలేని కృషి చేసిన చేబ్రోలు మహేష్ సేవలను గుర్తించిన అమెరికా దేశంలోని  మేరిల్యాండ్ స్టేట్ యూనివర్శిటీ డాక్టరేట్ ను ప్రకటించింది.

అమెరికా వెళ్ళి డాక్టరేట్ అందుకోలేని భారతీయులకోసం న్యూ దిల్లీలో ఆదివారం మేరిల్యాండ్ యూనివర్శిటీ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి డాక్టరేట్ లను ప్రధానం చేశారు.దానికి హాజరై డాక్టరేట్ అందుకున్న చేబ్రోలు మహేష్ మాట్లాడుతూ ఈ అవార్డు తన భాద్యతను మరింత పెంచిందన్నారు. విద్యారంగం నందు విరివిగా సేవ చేసేందుకు దోహదపడుతుందన్నారు.ఈ ప్రయాణంలో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. 

ఈ సందర్భంగా డాక్టరేట్ పొందిన మహేష్ ను మాజీ మంత్రి, చిలకలూరిపేట యమ్.యల్.ఎ ప్రత్తిపాటి పుల్లారావు ప్రత్యేకంగా అభినందించారు.పుర ప్రముఖులు,ఆర్యవైశ్య సంఘ నాయకులు,విద్యారంగంలోని పలువురు అభినందించిన వారిలో ఉన్నారు.
  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: డాక్టరేట్ పొందిన మోడ్రన్ సంస్థల డైరెక్టర్ మహేష్ Rating: 5 Reviewed By: chilakaluripetalocalnews