*విజ్ఞత మరిచి మైకుల ఏలా పడితే అలా మాట్లాడటం సరికాదు*
*విజయసాయి రెడ్డి తీరు గర్హనీయం*
*కేసరి యాక్టీవ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు మల్లెల శివనాగేశ్వరరావు*
చిలకలూరిపేట:
వైసీపీ నేత, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని కేసరి యాక్టీవ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ సంఘ జాతీయ అధ్యక్షుడు మల్లెల శివనాగేశ్వరరావు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన చేస్తు మీడియా సమావేశంలో ఉన్నప్పుడు, లక్షలాది మంది తమను గమనిస్తున్నారని, తన ప్రవర్తన, మాటలు ఏ మాత్రం తేడా ఉన్న ప్రజల్లో చులకన అవుతామన్న ఇంగిత జ్ఞానం మరిచి వ్యవహరించటం గర్హనీయమన్నారు. ఇటువంటి సమయంలో నోరు అదుపులో ఉంచుకొని, హుందాగా వ్యవహరించాల్సింది పోయి నోటికి ఏది వస్తే అలా మాట్లాడటం సరికాదని హితవు పలికారు.
ప్రశ్నించిన వారిపై వ్యక్తిగత విమర్శలు చేయడం గతం నుంచి విజయసాయిరెడ్డికి వస్తున్న ఆనవాయితీ అని, మీడియా ప్రతినిధులపై నోరు పారేసుకున్న ఏ రాజకీయ నాయకుడు కూడా మరీ ఇంతగా దిగజారిన దాఖలాలు లేవని పేర్కొన్నారు. రాజకీయ నాయకులపై ఆరోపణలు వచ్చినప్పుడు ధైర్యంగా సమాధానం చెప్పాలే గానీ .., ప్రశ్నించి.. సమాధానం రాబట్టుకోవాలి అనుకున్న జర్నలిస్టులను పేరు పెట్టి మరీ వార్నింగ్ ఇచ్చినట్లు మాట్లాడటం శోచనీయమన్నారు. ప్రశ్నించడం జర్నలిస్టుల హక్కుని, ప్రశ్నించలేనప్పుడు మేమెలా జర్నలిస్టులం అవుతామని ప్రశ్నించారు. మీడియా ప్రతినిధులపై నోరుపారేసుకోవడం అత్యంత నీచం.. హేయమని అభివర్ణించారు. ప్రజాస్వామ్య ప్రభుత్వానికి నాలుగవ పిల్లర్ గా ఉన్న మీడియా ప్రతినిధులమైన జర్నలిస్టులపై మాట్లాడుతున్న తీరు పద్ధతి కాదన్నారు. మీడియా ప్రతినిధులపై నోరుజారిన సాయిరెడ్డి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో తమ కేసరి యాక్టీవ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ ఇతర జర్నలిస్టు సంఘాలను కలుపుకొని రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు సిద్దమౌతామని మల్లెల శివనాగేశ్వరరావు హెచ్చరించారు.
--------------------
0 comments:
Post a Comment