728x90 AdSpace

NAVATHARAM NEWS

Followers

Latest News

మల్లెల శివ నాగేశ్వర రావు .నేషనల్ ప్రెసిడెంట్ కేసరి యాక్టీవ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్

Thursday, July 18, 2024

వినకొండ లో జగన్ నాటకం



*వినుకొండ లో జగన్నాటకాన్ని పోలీసులు అడ్డుకోవాలి! ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క కుటుంబాన్ని కూడా పరామర్శించని జగన్ నేడు వినుకొండలో శవ రాజకీయాలు చేసేందుకు రావడం సరికాదు..రావు సుబ్రహ్మణ్యం, నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు.*

*గతంలో ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో జగన్ రాష్ట్రంలో చనిపోయిన ఏ ఒక్క కుటుంబం వద్దకు వచ్చిన దాఖలాలు లేవని, ఇప్పుడు ప్రశాంతంగా ఉన్న పల్నాడు జిల్లాలో గొడవలు సృష్టించే పనిలో భాగంగా, శవరాజకీయాలకు ఆజ్యం పొసేందుకు వినుకొండకు రావడం దురదృష్టకరం అని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం అన్నారు.రషీద్ హత్యను నవతరం పార్టీ నుండి ఖండిస్తున్నామని నిందితుడు జిలానిని కఠినంగా శిక్షించడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని రావు సుబ్రహ్మణ్యం తెలిపారు.జిల్లాలో ప్రజలు ఇప్పుడు ఇప్పుడే ప్రశాంత వాతావరణం లో జీవిస్తూ ఉండటం ఇష్టం లేని జగన్ మరలా జిల్లాలో చిచ్చు పెట్టేందుకు వినుకొండకు రావడం ఆందోళన కలిగించే విషయం అని అన్నారు మాజీ వైస్సార్సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి ఎన్నికలు సమయంలో విధ్వంసం సృష్టించారని ఇప్పుడు ఇప్పుడే జిల్లాలో గొడవలు సద్దుమనిగే సమయంలో  జగన్  వినుకొండ పర్యటనకు వస్తే గొడవలు జరిగే అవకాశాలు ఉన్నందున పోలీస్ శాఖ అయన పర్యటనకు అనుమతి ఇవ్వకూడదని రావు సుబ్రహ్మణ్యం పల్నాడు జిల్లా ఎస్పీకి 19-07-2024 ఉదయం 7 గంటల సమయంలో విజ్ఞప్తి చేశారు.*
  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: వినకొండ లో జగన్ నాటకం Rating: 5 Reviewed By: chilakaluripetalocalnews