*
రాష్ట్రంలోనే ఆదర్శ నియోజవర్గంగా చిలకలూరిపేటను తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు. అధికారంలో ఉన్నా లేకున్నా అదే స్ఫూర్తితో పనిచేయడం వల్లనే ఈ రోజు చిలకలూరిపేటను అభివృద్ధిలో ఈ స్థాయిలో నిలబెట్టగలిగామన్నారాయన. ఆ కృషికి గుర్తింపుగా, వైకాపా హయాం వైఫల్యాలకు చెంపపెట్టుగానే చిలకలూరిపేట నియోజకవర్గం చరిత్రలోనే గుర్తుండిపోయేలాప్రజలు తీర్పునిచ్చార ని, మరీ ముఖ్యంగా మహిళలు తెలుగుదేశం పార్టీ కూటమికి అఖండ విజయం అందించారన్నారు ప్రత్తిపాటి. ఆదివారం చిలకలూరిపేట పండరీపురంలోని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కందిమళ్ల జయమ్మ ఆస్పత్రిలో ఓయాసిస్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిరుపేదలకు ఆర్ధికసాయం, మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఆర్యవైశ్య కల్యాణ మండపంలో వాసవీ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన మరో కార్యక్రమంలో ఆర్యవైశ్యులకు పింఛన్లు పంపిణీ చేశారు. స్థానిక ఎమ్మెల్యేగా ఆ కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రత్తిపాటి పుల్లారావు పేదలకు ఆర్ధికసాయం, మహిళలకు చీరలు, పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ అభివృద్ధి అంటే తెలుగుదేశం, చంద్రబాబు అని అందుకు తమ నియోజకవర్గమే నిదర్శనమన్నారు. గతంలో రాజకీయాలకు అతీతంగా అనేక కార్యక్రమాలు చేశామని.. లేకుంటే చిలకలూరిపేట కుప్పం స్థాయి లో అభివృద్ధి చెందేదే కాదన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో తీసుకొచ్చిన అనేక ప్రాజెక్టులు, కార్యక్రమాలు వైసీపీ ప్రభుత్వంలో ఆగిపోయాయని.. ఇప్పుడు వాటిని పూర్తి చేసి ఎలాంటి లోటు లేకుండా చూస్తామన్నారు. దెబ్బతిన్నరోడ్లు బాగు చేసుకుంటే అన్నీ వచ్చినట్లేనని చెప్పారు. తమ ప్రభుత్వం ఎప్పుడున్నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు సహా అందరికీ ఉపయోగపడే పనులు చేశామన్నారు. ముస్లిం మైనార్టీలకు చెందిన వెయ్యి మంది పిల్లలు చదువునేలా వసతిగృహం కూడా తెచ్చామన్నారు. అన్ని కులాలకు ఉపయోగపడే అన్నింటినీ తీసుకొచ్చానని వెల్లడించారు ప్రత్తిపాటి. దాతలు ముందుకొస్తే కందిమళ్ల జయమ్మ పేదలకు ఉపయోగపడే మరిన్ని కార్యక్రమాలు చేస్తారన్నారు. ఆమె ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ప్రజల కోసం అనేక పనులు చేశారని.. వైద్య శిబిరాలు ద్వారా ఎంతోమంది పేదలకు వైద్య సేవలు అందించారని కొనియాడారు ప్రత్తిపాటి. ఇప్పుడు తిరిగి ఓయాసిస్ సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు. ఏదోవిధంగా నిధులు సేకరించి 11 మంది ఉన్న ఓయాసిస్ సంస్థను 175 మందికి చేర్చారని కొనియాడారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందున్న ఆ సంస్థకు రాష్ట్ర, జాతీయ స్థాయి అవార్డు కూడా అందుకున్నారని.. అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూడా ఇలా సామాజిక సేవ చేసే సంస్థలు అంటే చాలా ఇష్టమని, ప్రజా భాగస్వామ్యం ఉన్న కార్యక్రమాలను ఆయన ఎప్పుడూ ప్రోత్సహిస్తారన్నారు. ఓయాసిస్ సంస్థ ఇంకా బాగా ముందుకు నడవాలని, జయమ్మ ఏవిధంగా అయితే దిల్లీలో అవార్డు పొందారో అదేవిధంగా రాష్ట్రస్థాయిలో ఆ సంస్థ మంచి పేరొందిన సంస్థగా రూపొందాలని ఆకాంక్షించారు.
0 comments:
Post a Comment