728x90 AdSpace

NAVATHARAM NEWS

Followers

Latest News

మల్లెల శివ నాగేశ్వర రావు .నేషనల్ ప్రెసిడెంట్ కేసరి యాక్టీవ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్

Monday, July 22, 2024

జర్నలిస్ట్





వెయ్యి మందిని ఎదుర్కోవడానికి ఒక్క జర్నలిస్టు చాలు. 

వేయి మంది నీకు శత్రువులు ఉన్నా గాని నీకు ఒక్క మిత్రుడు జర్నలిస్టు ఉంటే చాలు వేయి మందికి సమాధానం చెప్పే ఆయుధం వార్తలే,

గ్రామాలు మారాలన్న స్వార్థపరులు పోవాలన్న గ్రామాలు అభివృద్ధి చెందాలన్న  జర్నలిస్టు వార్తలే ప్రామాణికం.

ఒక రాజకీయ నాయకుడు ఎదగాలన్న ఒక రాజకీయ నాయకుడు పడిపోవాలన్నా జర్నలిస్టు రాసే వార్తలే తూటాలు.

ఒక ఎమ్మెల్యే గెలవాలన్నా,
ఒక ఎమ్మెల్యే ఓడిపోవాలన్నా
ప్రజలకు వివరించి చైతన్యపరిచే 
వార్తలే  ఫిరంగి గుండ్లు.

ప్రభుత్వం కళ్లు తెరవాలన్న,
ప్రభుత్వంలోని కుళ్ళు పోవాలన్నా, జీతభత్యాలు లేని జర్నలిస్టులు రాసే వార్తల వల్లే అది సాధ్యమవుతుంది.

స్వార్థపరులు శిక్షలు అనుభవించాలన్న నిస్వార్ధపరులు అవార్డులు రివార్డులు పొందాలన్నా సమాజంలో కుళ్ళు పోవాలన్నా సమాజం కళ్ళు తెరవాలన్నా నిబద్ధత కలిగిన జర్నలిస్టులు రాసే వార్తలే ఆయుధాలు. 

పేదలకు న్యాయం జరగాలన్న లంచావతారులు జైలుకు పోవాలన్న మహా మహా మనుషుల చరిత్రలు వెలుగులోకి రావాలన్నా అది జర్నలిస్టులతోనే సాధ్యం. 

ఉద్యమాలు లేవు ధర్నాలు లేవు రాస్తారోకోలు లేవు అంతా నిశ్శబ్దమే ఆసమస్యల పరిష్కారం కోసం ఒక్క జర్నలిస్టు రాసిన వార్త అంతకంతకు ఎక్కువ. 

గవర్నమెంట్ ఉద్యోగం కాదు, కానీ గళం ఎత్తి మాట్లాడే శక్తి, ఆశక్తే జర్నలిజం,
ఆ జర్నలిజం లేకపోతే సమాజం కొల్లగొట్టే వారి చేతిలోకి పోతుంది.

సమాజాన్ని రక్షించే శక్తి ఒక్క జర్నలిజం వృత్తికి ఉంది. జర్నలిస్టులు రాసే వార్తలే  అధికారులకు నాయకులకు పరుగులు పెట్టిస్తుంటాయి.

ప్రభుత్వం నుండి జీతాలు లేవు ప్రజల నుండి అభిమానం ఉంది అందుకే ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధి జర్నలిజం.

జర్నలిజాన్ని అణచివేయాలని చూసిన ప్రభుత్వాలు కూలిపోయాయి, కూలిపోయిన ప్రభుత్వాలను లేపాలంటే అది జర్నలిజంతోనే సాధ్యం. 

ఎన్నికల ప్రచారంలో కోట్లు ఖర్చు చేస్తారు కాని లాభం ఉండదు, అదే ఒక్క జర్నలిస్టు రాసే వార్త ప్రతి ఒక్కరి ఆలోచింపజేస్తుంది అదే జర్నలిజం ఫవర్.


చావలేక బతకలేక ప్రతినిత్యం చచ్చుకుంటు తమ మనసుని చంపుకుంటు పరువు కొరకు పాకులాడి
కలమమ్మను నమ్ముకుంటూ
బ్రతుకు బండి నడుపుకుంటూ అనుక్షణం కలకలలాడుతూ
సాగుతుంది మా జర్నలిజం నౌక,

ప్రెస్ మీట్లు పెట్టి మాకు నమస్కారాలు పెట్టి హీరో లాగా మాట్లాడే నాయకుల మాటలు కలం పట్టి రాసి ప్రపంచానికి తెలియచేయాలి, చివరికి మాకు ప్రసాదంలా చాయ్ బిస్కెట్లు ప్రసాదంతో సమానం, వారికి మాత్రం ప్రచారం ఎక్కువ. 


ఊరూరూ  వాడ వాడ తిరుగుతూ సమస్యల్ని స్వీకరించి 
అందంగా వార్తల్ని తీర్చిదిద్ది గల్లి వార్త డిల్లిదాకా
డిల్లి వార్త గల్లి దాకా చేరవేసే వృత్తి మరణం లేని వృత్తి.

అన్యాయం మోసం దగా కుట్రల్ని బయటకి తీస్తే శత్రువులు పెరగవచ్చు, అయినా పర్వాలేదు జర్నలిస్టుకు విలువలు పెరుగుతాయి.

ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి ఆగాలన్న, ప్రజల సమస్యలు ప్రభుత్వానికి తెలియాలన్నా, 
రాజకీయ నాయకుల లోపాలను ఎత్తి చూపాలన్న, 
అది ఒక జర్నలిజం వృత్తి తోనే సాధ్యం.

కూలికి పోయి సంపాదించి ఆలికి నాలుగు రాళ్లు ఇవ్వచ్చు, జర్నలిస్టులు వార్తలు రాస్తే ఏమి రాదు కదా, దిక్కుమాలిన ప్రభుత్వాలు ఇంకెంతకాలం మమ్మల్ని అనచివేస్తాయో చూస్తూ చూస్తూ ఏదో ఒకరోజు జర్నలిజం తుమ్మితే  ఏ ప్రభుత్వాలు అయినా ఊడిపోయే ముక్కు లాంటివే అదే జర్నలిజం పవర్,

మేము వార్తలు రాస్తే ప్రజలు ఆలోచించి రాజకీయ నాయకుడిని చేస్తారు. అదే రాజకీయ నాయకుడు ఊసరవెల్లిలా మారి ఖరీదైన కారులో పోతుంటే, బైకు మీద పోయే జర్నలిస్టును చూసి నమస్తే అంటాడు అదే జర్నలిజం పవర్. 

రాజకీయ నాయకుడికి, ప్రభుత్వ అధికారులకు పదవి దిగి పోగానే రామా రామా... అదే జర్నలిస్టు తుదిశ్వాస విడిచే వరకు కూడా అదే వృత్తిలో కొనసాగుతాడు అదే జర్నలిస్ట్ పవర్.

సమాజంలో నాలుగవ స్తంభం జర్నలిజం, ఆ స్తంబాన్ని దృఢంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాపాడుకుంటాయో లేదా కూల్చివేస్తాయో ఆలోచించుకోండి.

జర్నలిస్టులు ప్రపంచవ్యాప్తంగా వార్తలు స్తంభింప చేస్తే కాలమే ఆగిపోతుంది అనడంలో సందేహం లేదు. 

అందుకే జర్నలిజం అనే పావురాన్ని రక్షించుకుందాం, ప్రజల క్షేమం కోరుకుందాం, ప్రభుత్వాలు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆశిద్దాం, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిద్దాం...
  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: జర్నలిస్ట్ Rating: 5 Reviewed By: chilakaluripetalocalnews