చిలకలూరిపేట పట్టణంలోని పురుషోత్తపట్నం లో నెలకొని ఉన్న పలు సమస్యలను త్వరగతిన పరిష్కరించాలని కమిషనర్ గోవిందరాజును జనసేన పార్టీ చిలకలూరిపేట నియోజకవర్గ సమన్వయకర్త తోట రాజ రమేష్ గారు కోరారు.
గురువారం పురుషోత్తపట్నం లో పర్యటనలో భాగంగా మున్సిపల్ గోవిందరాజు ను కలిసి పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. గడిచిన వైయస్ఆర్సీపీ ప్రభుత్వంలో పురుషోత్తమ పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ లోపం వలన ప్రజలు అనేక ఇబ్బందులకు గురయ్యారని అన్నారు. గడిచిన ఐదు సంవత్సరాలు వార్డులలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదని అన్నారు. స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారి ఆధ్వర్యంలో
చిలకలూరిపేట పట్టణాన్ని అభివృద్ధి చేసి స్మార్ట్ సిటీగా రూపకల్పన చేయాలని రాజా రమేష్ కోరారు. మురుగు కాలువలలో సిల్ట్ తొలగించకపోవడం వలన వర్షాకాలంలో వర్షాలు పడేటప్పుడు ఆ నీరు రోడ్ల మీదకు రావటం వలన ప్రజలు ఇబ్బందులకు గురి అవుతున్నారని , ఆ సిల్టును త్వరగతిన తొలగించాలని కమిషనర్ను రాజ రమేష్ కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా సమితి కార్యదర్శి షేక్ సుభాని, పట్టణ అధ్యక్షులు మునీర్ హసన్, సాంబ, శివ శంకర్, అవినాష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
0 comments:
Post a Comment