రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర డైరీ కమిటీ కన్వీనర్ గా పోటు శ్రీనివాసరావు.చిలకలూరిపేట పట్టణంలో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మున్సిపల్ ప్రాథమిక పాఠశాల యందు సెకండరీ గ్రేడ్ టీచర్ గా పనిచేస్తున్న పోటు శ్రీనివాసరావు ను రాష్ట్ర సంఘం రాష్ట్ర డైరీ కమిటీ కన్వీనర్ గా నియమించడం జరిగింది.2000DSC ద్వారా నియామకం పొంది చిలకలూరిపేట పట్టణ శాఖ ప్రధాన కార్యదర్శి గా, ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి గా జిల్లా ఉపాధ్యక్షులు గా జిల్లా అసోసియేట్ అధ్యక్షులు గా జిల్లా అదనపు ప్రధాన కార్యదర్శి గా జిల్లా ఆర్థిక కార్యదర్శి గా చిలకలూరిపేట ప్రాంతీయ కార్యదర్శి గా రాష్ట్ర కమిటీ కన్వీనర్ గా రాష్ట్ర కార్యదర్శి గా పనిచేశారు. వీరిని రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు రాష్ట్ర డైరీ కమిటీ కన్వీనర్ గా నియమించడం పట్ల చిలకలూరిపేట ప్రాంతీయ శాఖల అభినందనలు తెలిపారు, ఎస్టీయూ పట్టణ అధ్యక్షులు మేకల కోటేశ్వరరావు కార్యదర్శి వడ్లన జయప్రకాష్, మండల అధ్యక్షులు బొంత రవి.ప్రధాన కార్యదర్శి షేక్ మస్తాన్ వలి. యడ్లపాడు మండలం అధ్యక్షులు జీకోటేశ్వరరావు. ప్రధాన కార్యదర్శి సతీష్ నాదెండ్ల మండల అధ్యక్షులు షేక్ మక్బుల్ భాష. కార్యదర్శి దుర్గా ప్రసాద్ ఎస్టీయూ నాయకులు చావలి మల్లేశ్వర రావుతదితరులు అభినందనలు తెలిపారుఈ సందర్భంగా పోటు శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర. జీళ్ళ సంఘం నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేస్తానని జిల్లా రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కృతజ్ఞతలు తెలిపారు.12వ పీఆర్సీ కమీషన్ చైర్మన్ ను నియమించాలని, వెంటనే 20%మధ్యంతర బృతి ప్రకటించాలని మున్సిపల్ ఉపాధ్యాయులకు పదోన్నతులు క్కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పాఠశాలల విలీనాన్ని విరమించుకోవాలని . జీ వో 117రద్దు చెయాల్లని కోరారు. ఉద్యోగ ఉపాధ్యాయ. సంఘాలతో చర్చించి సమస్యల పరిష్కారం కోసం చొరవ చూపాలని కోరారు.
0 comments:
Post a Comment